పబ్లిసిటీ పిచ్చి: న్యూడ్ గా ఆమెను (ఫోస్టర్)
హైదరాబాద్: పెద్ద సినిమాల కోసం అభిమానులు,మీడియా తమదైన శైలిలో ప్రమోషన్ చేస్తూంటుంది. మరి ఊరూ పేరు లేని చిన్న సినిమాల పరిస్దితి ఏంటి..తమ సినిమా గురించి ఎలా జనాలు మాట్లాడుకోవాలి..ఇది ఎప్పుడూ సమస్యే. అయితే ఇలాంటి సమస్యను అధిగమనించటానికి ఒక్కోసారి ఇదిగో ఇలాంటి చీప్ టెక్నిక్ ని దర్శక,నిర్మాతలు ఎంచుకుంటూంటారు.
మీరు ఇక్కడ చూస్తున్న పోస్టర్ పూనం రాయ్ హీరోయిన్ గా చేస్తున్న ఓ బి గ్రేడ్ సినిమా ...ఓకే అనే సినిమాకి సంభంధించినది. అమీర్ ఖాన్ కాంట్రావర్శీ పోస్టర్ పీకే ను అనుకరిస్తూ ఈ పోస్టర్ ని రూపొందించారని అర్దమవుతోంది. ఇప్పటికే ఈ పోస్టర్ పై అమీర్ అభిమానుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

పీకే పోస్టర్ సైతం విడుదల అయినప్పుడు మిశ్రమ స్పందన వ్యక్తం అయ్యింది. ఈ సినిమాలో అమీర్ ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపిస్తున్నట్టు ముందే తెలిసినా, ఇప్పుడు పోస్టర్ విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేశాడు అమీర్. ఇంతకీ ఎలా ఉన్నాడు? ఒంటిపై దుస్తులు లేకుండా రైలు పట్టాలపై అడ్డంగా నుంచుని తీక్షణంగా చూస్తున్నాడు. చేతిలో ఓ టూ ఇన్ వన్‌ను అడ్డం పెట్టుకున్నాడు కూడా.
తన మూడు దశాబ్దాల సినీ జీవితంలో అమీర్ ఇలాంటి అవతారంలో కనిపించడం ఇదే తొలిసారి. ఆన్‌లైన్లో ఈ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. మరో ప్రక్క ''నేనెలా ఉన్నానో తొందరగా చెప్పండి. తెగ కంగారుగా ఉంది'' అంటున్నాడు అమీర్‌ఖాన్. 'పీకే'లో తన కొత్త గెటప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అభిమానుల అభిప్రాయాలను కోరారు. ఇంతకీ ఈ పాత్ర ఏమిటనే విషయాన్ని త్వరలోనే బయటపెడతారట. ఈ ఏడాది డిసెంబర్19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి రాజ్‌కుమార్ హిరాని దర్శకత్వం వహిస్తున్నారు.
‘పీకే' సినిమా విషయానికొస్తే.... ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











