జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు.. జాగ్రత్త, నమ్మక ద్రోహి అంటూ కలకలం రేపిన పూనమ్!

Recommended Video

Poonam kaur Tweets About A Director

పంజాబీ భామ పూనమ్ కౌర్ మరో మారు సెగలు రేపింది. తన నర్మ గర్భ వ్యాఖ్యలతో కలకలం సృష్టిస్తోంది. తాను ఎవరిచేతిలోనో మోసపోయాను అన్నట్లుగా ఈ పంజాబీ భామ సోషల్ మీడియా వేదికగా అదికూడా పరోక్షంగా తన రివేంజ్ తీర్చుకుంటోంది. పూనమ్ కౌర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసేవిగా కనిపిస్తున్నాయి. పూనమ్ కౌర్ టార్గెట్ ఎవరు అనే ప్రశ్నపై ఉహాగానాలు మొదలైపోయాయి. తెలుగు పలు చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్ కు ప్రస్తుతం సరైన అవకాశాలు రావడం లేదు.

అప్పటి నుంచే ఇలా

అప్పటి నుంచే ఇలా

కొద్ది రోజుల క్రితం ఓ ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే వ్యక్తి మీడియాలో పవన్ కళ్యాణ్ ని తిడుతూ తెగ హల్ చల్ చేశాడు. ఆ సందర్భం నుంచే పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఇలాంటి నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టింది.

సంచలన వ్యాఖ్యలు

తాజగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సెగలు రేపే విధంగా ఉంది. జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త అంటూ పూనమ్ చేసిన ట్వీట్ సినీ వర్గాలని ఆలోచనలో పడేసింది. ఈమె వ్యవహారం ఎదో చూస్తుంటే ఇండస్ట్రీలో మరో పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది.

ఆ దర్శకుడు ఎవరు

ఎన్నారై హీరోయిన్ల వైపు చూసే ఓ దర్శకుడు అంటూ పూనమ్ మరో ట్వీట్ చేసింది చేసింది. కేవలం నాకు హిట్ లేకపోవడం వలనే పక్కన పెట్టేశారు అంటూ కూడా వ్యాఖ్యానించింది. కొన్ని ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదని పూనమ్ తెలిపింది.

వాళ్లిద్దరే టార్గెట్ అంటున్న ఫాన్స్

వాళ్లిద్దరే టార్గెట్ అంటున్న ఫాన్స్

పూనమ్ వ్యాఖ్యలు నర్మగర్భంగా ఓ హీరో, డైరెక్టర్ ని టార్గెట్ చేస్తోందంటూ ఫాన్స్ కామెంట్లు మొదలు పెట్టారు. తాను ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్స్ చేస్తుందో మాత్రం పూనమ్ తేల్చడం లేదు.

అభిమానుల్లో ఆలోచన

అభిమానుల్లో ఆలోచన

పూనమ్ ట్వీట్స్ పై సినీ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఓ హీరో అభిమానులు వాదన ప్రకారం ఇందులో రాజకీయ కుట్ర కూడా దాగివుందని అంటున్నారు. ఇప్పటికే తమ హీరోపై నలువైపులా నుంచి కుట్రలు జరుగుతున్నాయని, పూనమ్ వ్యాఖ్యలు కూడా అందులో భాగమే అనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా తన ట్వీట్స్ పై క్లారిటీ ఇవ్వవలసిన అవసరం పూనమ్ కు ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X