‘ఎన్టీఆర్-మహానాయకుడు’ రిలీజ్ వేళ... మీడియాకు దూరంగా దర్శకుడు క్రిష్!

ఎన్టీఆర్ బయోపిక్... ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే అంచనాలు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. మొదట తేజ దర్శకత్వంలో లాంచ్ అయిన ఈ మూవీ... పలు కారణాలతో క్రిష్ జాగర్లమూడి చేతుల్లోకి వెళ్లింది. ఆయన వచ్చాక సినిమాను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించారు. మొదటి భాగాన్ని 'ఎన్టీఆర్-కథానాయకుడు' పేరుతో సంక్రాంతికి విడుదల చేశారు. సినిమాకు మంచి టాక్, పాజిటివ్ రివ్యూలు వచ్చినా ప్రేక్షకాదరణ లేక నష్టాలపాలైంది.

కెప్టెన్ ఆఫ్ ది షిప్... డైరెక్టరే కాబట్టి ఈ ఫెయిల్యూర్‌కు కారణం దర్శకుడు క్రిష్ అనే వాదన తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఒక భాగంగా తీయాలనుకున్న సినిమాను రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన చేసింది కూడా అతడే అని, 'ఎన్టీఆర్-మహానాయకుడు' విషయంలో ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండబోతోంది? అనేది హాట్ టాపిక్ అయింది.

‘ఎన్టీఆర్-మహానాయకుడు' రిలీజ్ వేళ... మీడియాకు దూరంగా

‘ఎన్టీఆర్-మహానాయకుడు' రిలీజ్ వేళ... మీడియాకు దూరంగా

సినిమా విడుదలవుతుంది అంటే ప్రమోషన్స్ నిర్వహించడం సర్వసాధారణంగా జరిగే తంతు. అయితే ‘ఎన్టీఆర్-మహానాయకుడు' రిలీజ్ వేళ ఎక్కడా సినిమా ప్రమోషన్స్ కనిపించడం లేదు. హీరో బాలయ్య... దర్శకుడు క్రిష్ మీడియాకు దూరంగానే ఉంటున్నారు. ఇదంతా మొదటి భాగం ఫెయిల్యూర్ ఎఫెక్టే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎన్టీఆర్-మహానాయకుడు ఎలా ఉండబోతోంది?

ఎన్టీఆర్-మహానాయకుడు ఎలా ఉండబోతోంది?

ఎన్టీఆర్-కథానాయకుడులో ఆసక్తికర అంశాలు పెద్దగా ఏమీ లేక పోవడం కూడా ప్రేక్షకాదరణ తగ్గడానికి ఒక కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. మరి రేపు(ఫిబ్రవరి 22) విడుదలవుతున్న ఎన్టీఆర్-మహానాయకుడులో అయినా అందరికీ తెలిసిన విషయాలు కాకుండా తెలియని కొత్త విషయాలు ఏమైనా ఉంటాయా? అనేది చర్చనీయాంశం అయింది.

నెగిటివ్ ప్రచారం మరో వైపు...

నెగిటివ్ ప్రచారం మరో వైపు...

మరో వైపు ఎన్టీఆర్-మహానాయకుడులో ఎన్టీ రామారావు వెన్నుపోటుకు గురైన అంశాలను చూపిచడం లేదని... ఆయన రాజకీయ జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటన చూపించడం లేదని కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.

ప్రజలకు రీచ్ అవుతుందా?

ప్రజలకు రీచ్ అవుతుందా?

‘ఎన్టీఆర్- మహానాయకుడు' విషయంలో ప్రమోషన్స్ సరిగా లేక పోవడం, నెగిటివ్ ప్రచారం.... వెరసి ఇది ప్రేక్షకులు ఏ మేరకు రీచ్ అవుతుంది? అనేది చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X