For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ స్టార్ మహేష్ ఈవెంట్‌కు ఊహించని షాక్.. మెగాస్టార్ తరహాలోనే!

    |
    Poor Response For Mahesh’s Event in US

    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యూఎస్ లో తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. వాస్తవానికి యూఎస్ లో మహేష్ తాజా చిత్రం మహర్షి షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ కి కొంత గ్యాప్ రావడంతో మహేష్ కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా మహేష్ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకునేందుకు మా అసోసియేషన్ వారు వేసిన ఎత్తుగడ ఫలించలేదు.

    చాలా రోజులుగా ప్రయత్నాలు

    చాలా రోజులుగా ప్రయత్నాలు

    మా అసోసియేషన్ కు సొంతంగా బిల్డింగ్ ఉండాలని, బిల్డింగ్ నిర్మాణం కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిధులు లేకపోవడంతో వివిధ రకాల ఈవెంట్స్ నిర్వహించి సేకరించాలని మా అసోసియేషన్ భావించింది. ఎన్నారైలని టార్గెట్ చేసిన మా అసోసియేషన్ గత ఏడాది నుంచి పలు ఈవెంట్స్ నిర్వహిస్తోంది.

    అరవింద సమేత హీరోయిన్ ఒంటి రంగు గురించి కామెంట్.. ఎలా తిప్పికొట్టిందో తెలుసా!

    గత ఏడాది మెగాస్టార్ చిరుతో

    గత ఏడాది మెగాస్టార్ చిరుతో

    గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో మా అసోసియేషన్ వారు అమెరికాలో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ కు అంతంత మాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత ఇటీవల మా అసోసియేషన్ లోనే లుకలుకలు బయట పడడంతో సంచలనంగా మారింది. తమ్మారెడ్డి భరద్వాజ చొరవతో ఆ సమస్య పరిష్కారం అయింది.

    మహేష్ చీఫ్ గెస్ట్

    మహేష్ చీఫ్ గెస్ట్

    మహేష్ ప్రస్తుతం యూఎస్ లోనే ఉండడంతో మరో మారు నిధుల సేకరణ కోసం ప్రయత్నించాలని మా అసోసియేషన్ భావించింది. ఈ నెల 27 న మహేష్ బాబు ముఖ్య అతిధిగా ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమం క్యాన్సిన్ అయినట్లు సమాచారం.

    స్పందన కరువు

    స్పందన కరువు

    ఎన్నారై అభిమానుల నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొదట ఈ ఈవెంట్ కు టికెట్ ధర 2 వేల డాలర్లుగా నిర్వహించారు. ఎన్నారై అభిమానులు ఏమాత్రం ఆసక్తి చూపించకపోవడంతో 450 డాలర్లకు టికెట్ ధర తగ్గించారు. అయినా కూడా ఆశించిన రెస్పాన్స్ రాలేదు. దీనితో ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.

    అది కూడా కారణమా

    అది కూడా కారణమా

    ఈవెంట్ క్యాన్సిల్ కావడానికి మా అసోసియేషన్ లో లుకలుకలు కూడా కారణం అని వార్తలు వస్తున్నాయి. ఈవెంట్ ని సరిగా ప్లాన్ చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీనితో మా అసోసియేషన్ ఎలాంటి స్పందన తెలియజేస్తుందో చూడాలి.

    English summary
    Poor Response For Mahesh’s Event in US. Mahesh Babu busy with Maharshi shooting
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X