మహేష్ బాబుది కంత్రీ క్యారెక్టర్
మహేష్‌ది కంత్రీ క్యారెక్టర్. అతను ఏంచెబుతున్నాడో, ఎందుకు చెబుతున్నాడో అర్థంకాదు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అని పూరీ జగన్నాధ్ చెప్పుకొచ్చారు. ఆయన తన తాజా చిత్రం 'బిజినెస్‌మేన్'త్వరలో విడుదల కానున్న సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి ఇలా స్పందించారు. అలాగే... మహేష్‌ని తప్ప సినిమాలో మరెవరినీ చూడలేం. వినోదం కూడా అతని క్యారక్టర్ ద్వారానే ఉంటుంది. బ్రహ్మానందం, అలీ వంటి కమేడియన్స్ లేరు. పోకిరితో పోలిస్తే మహేష్ పర్‌ఫార్మెన్స్ పెరిగింది. వాయిస్‌లో కూడా మార్పు కనిపించింది అని పూరి పేర్కొన్నారు. భాయ్ కావాలనుకున్నోడి కథ ఇది. 'పోకిరి' చిత్రానికి ఈ చిత్రానికి మహేష్‌లో చాలా మార్పు వచ్చింది. ఇందులో కొత్త మహేష్ కనిపిస్తాడు. ఆ చిత్రం తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో చిత్రం అంటే అంచనాలుంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ చిత్రం వుంటుంది అన్నారు.
ఇక ఈ చిత్రంలో.. 'పోకిరి' తరహా డైలాగ్‌లు మాత్రం వుండవు. ఈ చిత్రంతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేయనున్నాం. థియేటర్లు సర్దుబాటు కానందున తమిళ, మళయాల భాషల్లో ఈ చిత్రాన్ని 15 రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్నాం' అన్నారు. బిజినెస్ గురించి మాట్లాడుతూ..'మూడున్నర నెలల్లో 'బిజినెస్‌మేన్' పూర్తి చేశాం. మొత్తం 74 రోజులు షూటింగ్ చేస్తే మహేష్ 65రోజులు వర్క్ చేశాడు. ముందు ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయాలనుకున్నాం. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 13న విడుదల చేస్తున్నాం' అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్.ఇది ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం 16 వందల థియేటర్లలో విడుదలవుతోంది. ఈ రోజు నుంచే అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో ఏ చిత్ర విడుదల కాలేదు. ఈ చిత్ర ఆడియోకు అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తోంది. సార్ వస్తారా పాట విశేషంగా అలరిస్తోంది. ఈ చిత్రానికి మహేష్ స్పెషల్ ఎట్రాక్షన్.


Click it and Unblock the Notifications











