మహేష్ మోసం చేస్తున్నాడు: పూరీ జగన్నాధ్
ప్రతి హీరోయిన్ గురించీ ఇలాగే మంచిగా చెప్పి మోసం చేస్తుంటారు మహేష్ అంటూ పూరి జగన్నాధ్ అందరినీ నవ్వించారు. బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్ లో జరిగిన ఆ వివరాల్లోకి వెళితే..
పూరి: కాజల్ గురించి మీ అభిప్రాయం?
మహేష్: అద్భుతమైన సహ నటి. తనతో పని చేయడం చక్కటి అనుభూతి.
పూరి: ప్రతి హీరోయిన్ గురించీ ఇలాగే చెప్పి మోసం చేస్తుంటారు మహేష్. ఇదివరకు హీరోయిన్‌ల గురించి ఏమేం మాట్లాడారో ఒకసారి ఆడియో విజువల్ వెయ్యండి.
అనగానే వీడియో ప్లే చేసారు. ఆ దృశ్యాల్లో ప్రతి హీరోయిన్ గురించీ మహేష్ ఒకేలా చెప్పడం చూసి బిజినెస్ మ్యాన్ ఆడియో వేడుకలో నవ్వులు విరబూశాయి. ఈ వేడుకలో దర్శకుడు పూరి పాత్రికేయుడి అవతారమెత్తి మహేష్, కాజల్, నమ్రత, ఛార్మిలపై ప్రశ్నలను సంధించి సభికుల్ని అలరించారు. అలాగే...
పూరి: మీ భార్యాభర్తల్లో ముందు ఎవరు ఎవరికి ఐ లవ్ యూ చెప్పారు?
మహేష్: అది జరిగి చాలా యేళ్లయింది. గుర్తొచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి చెబుతా.
పూరి: సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరి గురించీ పుకార్లు వస్తుంటాయి. మీపై మాత్రం రావు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటారు?
మహేష్: మీరు మళ్లీ ఇబ్బందికరమైన ప్రశ్న అడుగుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడమేమిటి? నేనింట్లోనే ఎక్కువగా గడుపుతా
అంటూ మహేష్ నవ్వుతూ సమాధాన మిచ్చారు.చదువుతూంటే మీకూ నవ్వు వస్తోంది కదూ...


Click it and Unblock the Notifications











