'అవును'హీరోయిన్ తెలుగులో మరో చిత్రం
త్రిష విషయానికి వస్తే ఆమె గతంలో ఎమ్ ఎస్ రాజు బ్యానర్ లో మూడు చిత్రాలు చేసింది. ఆ బ్యానర్ లో ఆమె చేసిన వర్షం చిత్రం సూపర్ హిట్టైంది. ఆ సినిమాతో తెలుగులో ఆమె లాంచ్ అయ్యింది. అలాగే ఆ తర్వాత ఆమె సిద్దార్ద తో చేసిన నువ్వు వస్తానంటే నే వద్దంటానా చిత్రం కూడా మెగా హిట్టై తెలుగులో ఆమెకు కెరీర్ నిలబడేలా చేసింది. ఆ తర్వాత చేసిన పౌర్ణమి చిత్రం ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆ బ్యానర్ లో ఆమె ఏ చిత్రమూ చేయలేదు. చిరకాలం గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ లో చిత్రం రావటంతో ట్రేడ్ లో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
ఈ చిత్రం హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అని సమాచారం. పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి. ఇక ఈ చిత్రం టైటిల్ తొలకరి అని ప్రచారంలో ఉంది. అయితే ఈ చిత్రం ఎమ్మెస్ రాజు డైరక్ట్ చేస్తారా లేదా అని తెలియాల్సింది ఉంది. ఎమ్ ఎస్ రాజు డైరక్ట్ చేసిన తూనీగ...తూనీగ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతో తన కుమారుడుని పరిచయం చేస్తూ తానే డైరక్ట్ చేసారు. అయితే మరీ పాతకాలం తరహా కథ,కథనాలతో,టీవీ సీరియల్ ట్విస్టులతో సినిమా తయారవటంతో ముంచేసింది.


Click it and Unblock the Notifications












