రోడ్లు క్లీన్ చేసిన సింగర్ స్మిత (ఫోటోలు)
విజయవాడ: మన దేశాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా సింగర్ స్మిత కూడా విజయవాడలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘మార్గము' అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది. ‘మార్గము' సంస్థ కార్యకర్తలతో కలిసి స్మిత ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని స్మిత పిలుపునిచ్చారు.
స్లైడ్ షోలో ‘మార్గము' సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమ ఫోటోలు...

స్మిత
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బస్టాఫ్ శుభ్రం చేస్తున్న సింగర్ స్మిత.

స్వచ్ఛ భారత్
దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘స్వచ్ఛ భారత్' కార్యక్రమం జరుగుతోంది.

మార్గము
మార్గము స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లతో కలిసి స్మిత ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముందు నుండి మోడీకి మద్దతు
మెడీ ఎన్నికల బరిలో ఉన్నప్పటి నుండే స్మిత తన మద్దతు ప్రకటిస్తూ వస్తోంది. 'వేక్ అప్ ఇండియా' పేరుతో అప్పట్లో ఆల్బమ్ విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











