సెక్సీ పాప్ స్టార్ షకీరా...కాళికా దేవిగా
ప్రముఖ పాప్ స్టార్ షకీరా త్వరలో కాళికా మాత అవతారమెత్తనుంది. ఎందరికో కలల శృంగార దేవత అయిన షకీరా ని ఆ గెటప్ లో చూడడం అభిమామనులకు కాస్త కష్టమనిపించినా ఆమె మాత్రం చాలా ఉత్సాహం చూపున్నట్లు సమాచారం. తాజాగా ఆమె వాకా వాకా. పాటతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆమెతో ఆ ప్రపోజల్ పెట్టింది..లండన్ లో ఉంటున్న ఇండియన్ నిర్మాత కరణ్ అరోరా. ఆయన కాళీది వారియర్ గాడెస్ పేరిట ఓ హిందీ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం ఎందరినో అనుకుని ఫైనల్ గా షకీరా అయితేనే కాళికా మాతగా కరెక్టుగా సూటవతుందని నిర్ణయానికి వచ్చారు. ఇక ఈ విషయం ఆయన మీడియాతో చెప్తూ..సినిమా గురించి షకీరాను సంప్రదించాం. ఇందులో నటించడానికి ఆమె ఒప్పుకున్నారు. త్వరలో ఒప్పంద పత్రాలలో సంతకం కూడా పెట్టబోతున్నారు. ఇది 3డి మోషన్ ఫిలిం. రెండున్నర గంటలు నిడివి గల ఈ చిత్రాన్ని లండన్‌లో లేక ఈస్ట్రన్ యూరప్‌లో చిత్రీకరించాలనుకుంటున్నాం అన్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ఆరంభించడానికి కరణ్ అరోరా సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











