Popcorn Movie Censor Review అవికా గోర్, సాయి రోనక్ కెమిస్ట్రీకి ప్రశంసలు.. ఎలాంటి సర్టిఫికెట్ ఇచ్చారంటే?
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో దేశవ్యాప్తంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న అవికా గోర్, యువ హీరో సాయి రోనక్ జంటగా నటించిన చిత్రం పాప్ కార్న్. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎంఎస్‌చలపతి రాజు సమర్పణలో భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్ అవికా గోర్ సహ నిర్మాతగా వ్యవహరించటం గమనార్హం. ఫిబ్రవరి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో పాప్ కార్న్ సినిమాపై సెన్సార్ రివ్యూ విషయంలోకి వెళితే..

లిఫ్టులో హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ
పాప్ కార్న్ చిత్రం విషయానికి వస్తే.. ట్రైలర్ ప్రకారం.. ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ సమయంలో లిఫ్టులో ఇరుక్కుపోయిన అవికా గోర్, సాయి రోనక్ మధ్య జరిగిన కీచులాటలు, ప్రేమ వ్యవహారంతోపాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపించాయి. కథ ప్రధాన భాగం మొత్తం లిఫ్టులోనే జరగడం దర్శకుడు మురళీ గంధం ప్రతిభకు అద్దంపట్టేలా ఉంది.

పాప్ కార్న్‌కు సెన్సార్ ప్రశంసలు
లవ్, ఎమోషన్స్, అవికా గోర్, సాయి రోనక్ మధ్య కెమిస్ట్రీతో రూపొందిన పాప్ కార్న్ చిత్రాన్ని ఇటీవల వీక్షించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.

రకరకాల ఎమోషన్స్‌తో పాప్ కార్న్
చిత్ర సమర్పకుడు ఎంఎస్ చలపతి రాజు మాట్లాడుతూ.. పాప్ కార్న్ తెలుగు మూవీని ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారని, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సినిమా అని ప్రశంసించారు అని అన్నారు.

అవికా గోర్ నిర్మాతగా
అవికా గోర్ మాట్లాడుతూ .. పాప్ కార్న్ డిఫరెంట్ మూవీ అని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న పాప్ కార్న్‌తో సందడి చేయబోతున్నాం అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ సెన్సార్ సభ్యులకు సినిమా నచ్చింది. థియేటర్లో ఉన్న ఆడియెన్స్‌కు చివరి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఉంటుంది అని అన్నారు.

పాప్ కార్న్ తెరవెనుక, తెర ముందు
నటీనటులు: అవికా గోర్, సాయి రోనక్ తదితరులు
సమర్పణ: ఎంఎస్ చలపతి రాజు
బ్యానర్స్: ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్
నిర్మాత: భోగేంద్ర గుప్తా
కాన్సెప్ట్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మురళి గంధం
సహ నిర్మాత: అవికా గోర్, ఎం.ఎస్.చలపతి రాజు, శేషు బాబు పెద్దింటి
సినిమాటోగ్రఫి: ఎంఎన్ బాల్ రెడ్డి
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఎడిటర్: కేఎస్ఆర్
ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్
కొరియోగ్రఫీ: అజయ్ సాయి
ఫ్యాషన్ డిజైనర్: మనోహర్ పంజా
పీఆర్వో: నాయుడు సురేంద్ర, ఫణి (బియాండ్ మీడియా)
పోస్టర్స్, లిరికల్స్: నియో స్టూడియోస్
డిజిటల్ మార్కెటింగ్: మ్యాంగో మీడియా
మ్యూజిక్: ఆదిత్యమ్యూజిక్
రిలీజ్ డేట్: 2023-02-10


Click it and Unblock the Notifications











