»   » ఇద్దరితో ఉన్న అఫైర్‌ను బయటపెట్టిన యాంకర్ రవి!

ఇద్దరితో ఉన్న అఫైర్‌ను బయటపెట్టిన యాంకర్ రవి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెర మీద స్టార్ యాంకర్‌గా మారిన రవి కొత్త అవతారం ఎత్తాడు. టెలివిజన్‌ రంగంలో స్టైలిష్ లుక్స్, మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న రవి వెండితెర మీద హీరోగా మారాడు. యువ దర్శకుడు అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇది మా ప్రేమ కథ' చిత్రంలో కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. రవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ త్వరలోనే సినీ ప్రముఖుడి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.

 Popular Anchor Ravi Turned Hero With Idhi Maa Prema Katha

మత్స్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: ఓంకార్ కడియం, పాటలు: దినేష్ (నాని), సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి, సహ నిర్మాతగా పీఎల్‌కే రెడ్డి వ్యవహరిస్తున్నారు.

English summary
Anchor Ravi is introducing as Hero in Idhi Maa Prema Katha. First look of this movie will release very soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu