‘పుష్ప సెట్ లో జరిగింది ఇదే.. కావాలనే ఇరికించారు’
Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్టోబర్ 8న జాతీయ అవార్డుల ప్రధానం కార్యక్రమంలో ఉత్తమ కోరియోగ్రాఫర్ అవార్డు అందుకోవడానికి బెయిల్ మంజూరు అయింది. అయితే.. అనూహ్యంగా ఆయనకు ఇచ్చే అవార్డును రద్దు చేశామని కమిటీ వెల్లడించింది. ఈ వివాదంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ కస్తూరి మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొరియోగ్రాఫర్ కస్తూరి మాస్టర్ ఓ ఇంటర్య్యూలో మాట్లాడుడూ.. జానీ మాస్టర్ ను కావాలనే కేసులో ఇరికించారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు బనాయించారని షాకింగ్ కామెంట్స్ చేసింది. పక్కా ఫ్లాన్ ప్రకారమే.. ఆ అమ్మాయి మైనర్ అని కేసు పెట్టారనీ. అలా చేస్తే కేసు బలపడుతుందని, ఈ విషయంలో సాక్ష్యాదారాలకు కూడా దొరకవు అన్నారు. జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలన్నీ ఆధారాలు లేవని, అవన్నీ అసత్య అసత్య ప్రచారాలేనని అన్నారు. ఇప్పటికే పెట్టిన కేసులు అన్ని తేలిపోతున్నాయని, మొదటిగా క్యారవాన్ లో లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. కానీ, అందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ను బయటపెట్టాలి కదా అని ప్రశ్నించారు కస్తూరి మాస్టర్.

ఇక సెట్స్ లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాంటి ఆరోపణలు చేస్తే.. మాస్టర్ సభ్యత్వం పోతుందని కుట్ర చేశారన్నారు. మరోవైపు.. ముంబై షూటింగ్ సమయంలో ఓ హోటల్లో తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఆరోపించారు. కానీ, ఆ రోజు షూటింగ్ క్యాన్సెల్ అయిందనీ, ఆ ఆరోపణలన్నీ అవాస్తమని తేలిపోయింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ లొకేషన్స్ లో లైంగిక దాడి జరిగిందన్నారు. కానీ.. మాస్టర్ అక్కడికి వెళ్లలేదని చాలామంది ఇప్పటికే తేల్చి చెప్పారన్నారు కస్తూరి మాస్టర్ .
మరీ పుష్ప లొకేషన్స్ లో ఆ అమ్మాయిపై జానీ మాస్టర్ దాడి చేశారని ఆరోపణలు వచ్చాయని ప్రశ్నించగా.. పుష్ప సెట్స్ లోకి జానీ మాస్టర్ వెళ్లిన విషయం వాస్తవమేనని, కానీ అక్కడ వారు తమ పర్సనల్ విషయాలను చర్చించుకున్నారని, ఈ క్రమంలో వారిద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగిందని, ఈ సమయంలోనే డైరెక్టర్ సుకుమార్ ఇన్వాల్వ్ ఆ సమస్యను అక్కడితో పరిష్కరించారని అన్నారు. ఆ సమస్య పూర్తయి మూడ్నాలుగు ఏండ్లు అవుతోందనీ, ఇన్ని రోజులు లేని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తుంది? అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు కస్తూరి మాస్టర్.
జానీ మాస్టర్ ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఆ లేడీ కొరియోగ్రాఫర్ కు ఉందనీ, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని, ఎలాగైనా.. తన పరువు పోతుందనీ, కానీ, తాను అనుకున్నది సాధించాలని ఇలా కుట్ర చేసిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ కస్తూరి మాస్టర్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే.. మాస్టర్ పెళ్లి చేసుకోవాలని వేధించారని ఆరోపణలపై కస్తూరి మాస్టర్ స్పందిస్తూ.. జానీ మాస్టర్ కావాలని వేధిస్తే.. పరిస్థితి మరోలా ఉండేదని, కానీ,ఆ అమ్మాయితో లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం తనకు తెలిసినంత వరకు వాస్తవమేనని కస్తూరి మాస్టర్ చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం మాస్టర్ మాత్రం లేదని అన్నారు.
ఈ విషయంలో మాస్టర్ భార్య చాలా మనోవేదనకు గురవుతుందనీ, ఈ విషయం గురించి ఆమె గత రెండు సంవత్సరాలుగా బాధపడుతుందని అన్నారు. జానీ మాస్టర్ గురించి అన్ని విషయాలు ఆ అమ్మాయికి తెలుసని, మాస్టర్ ను తన అవసరాలకు వాడుకుందని, తనకు ఫేమ్ వచ్చేలా యూజ్ చేసుకుందనన్నారు. తన అవసరాలు తీరగా.. సరిగ్గా మాస్టర్ కు నేషనల్ అవార్డు వచ్చే సమయంలోనే ఇలాంటి ఆరోపణలు చేసిందని కస్తూరి మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదంతా కక్ష సాధింపు చర్య, ఇదొక కుట్రని, జానీ మాస్టర్ వెనుక పొలిటికల్ లేదా ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేదని, అవార్డు వచ్చే సమయంలో ఇలాంటి అసత్య ఆరోపణలు, అబద్ధపు కేసులు పెట్టేవారు కాదని కస్తూరి మాస్టర్ మండిపడ్డారు. ఈ కేసులో ఇండస్ట్రీలో పెద్దలున్నారు కాబట్టే.. జానీ మాస్టర్ విషయంపై ఎవరూ మాట్లాడటం లేదని, మాట్లాడే వారి గొంతును నొక్కేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది కస్తూరి మాస్టర్. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ విషయంపై ఎవ్వరు కూడా మాట్లాడలేదని అందరి సైలెంట్ గా ఉండిపోయారని షాకింగ్ కామెంట్ చేశారు కస్తూరి మాస్టర్.


Click it and Unblock the Notifications











