మహేష్ బాబుతో ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ చేయాలనుకుంటున్న ప్రముఖ హాలీవుడ్ స్టార్!
Recommended Video
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే ఇతర దేశాలవారు బాలీవుడ్ చిత్రాల గురించే చర్చించేవారు. కానీ బాహుబలి, 2.0 లాంటి సినిమాల తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీలపై, ఇక్కడి స్టార్స్, టెక్నీషియన్ల గురించిన వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అవెంజర్స్:ది ఎండ్ గేమ్ డైరెక్టర్ జో రుస్సో సైతం ఇటీవల సినిమా ప్రమోషన్లో భాగంగా ఇండియా వచ్చినపుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో చిత్రం గురించి ప్రస్తావించడంతో పాటు.. ఆ సినిమా ద్వారా స్పూర్తి పొంది గతంలో తాను తీసిన ఓ అవెంజర్స్ సిరీస్‌లో కొన్ని సీన్లు పెట్టినట్లు తెలిపారు.

బిల్ డ్యూక్
తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్ తన ట్వీట్లో మహేష్ బాబు గురించి ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది. ప్రిడేటర్, కమాండో లాంటి పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన డ్యూక్ మహేష్ బాబుతో కలిసి ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయాలని ఉందంటూ ట్వీట్ చేశారు.
మహేష్ బాబుతో స్పై థ్రిల్లర్ చేయాలనుకుంటున్న బిల్ డ్యూక్
‘బిల్ డ్యూక్ తన తాజా ట్వీట్లో మహేష్ బాబుతో పాటు వంశీ పైడిపల్లి, ఏఆర్ మురుగదాస్ గురించి ప్రస్తావించారు. ‘‘మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, ఏఆర్ మురుగదాస్... మీరు ఎప్పుడు లాస్ ఏంజిల్స్ వచ్చినా మా ఆఫీసుకు రండి. మనం కలిసి భోజనం చేస్తూ ఇంటర్నేషనల్ స్పై మూవీ చేయడంపై చర్చించుకుందాం.‘‘ అంటూ ట్వీట్ చేశారు

ఐశ్వర్య ధనుష్ గురించి కూడా...
మరో ట్వీట్లో ప్రముఖ తమిళ నటుడు ధనుష్ భార్య ఐశ్వర్య గురించి ప్రస్తావించారు. ‘మీరు ఎప్పుడు లాస్ ఏంజిల్స్ వచ్చినా మా ఆఫీసకు రండి... ఇక్కడ లంచ్ చేస్తూ ఇంటర్నేషనల్ ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి చేయబోయే కార్యక్రమాల గురించి చర్చిద్దాం.' అని ట్వీట్ చేశారు.

హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్న మహేష్ ఫ్యాన్స్
మహేష్ బాబు గురించి బిల్ డ్యూక్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిల్ డ్యూక్ ప్రపోజల్ బావుందని, మహేష్ బాబు లాంటి స్టార్ ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ మూవీలో బాగా సూటవుతాడనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ అభిమాన హీరోను వీలైనంత త్వరగా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు.

మహేష్ బాబు వరకు విషయం వెళ్లిందా?
ప్రస్తుతం మహేష్ బాబు తన కుటుంబంతో పారిస్ పర్యటనలో ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన చేసిన ‘మహర్షి' మూవీ షూటింగ్ ఇటీవలే ముగియడంతో సమ్మర్ వెకేషన్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో బిజీ కాబోతున్నారు. ‘మహర్షి' మే 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











