twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడి మృతి.. ప్రముఖుల నివాళులు

    |

    ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. చిత్ర సీమకు చెందిన ప్రముఖులు తనువు చాలిస్తున్నారు. ఒకరి మరణ వార్త తర్వాత మరొకరి మరణం సినీ ఇండస్ట్రీని కలిచివేస్తుంది. కొందరు ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తుంటే మరికొందరు బలవన్మరణాలతో మరణిస్తున్నారు. ఈ మధ్యనే ఆగస్టు 28న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ తండ్రి మోన్ రావు కాలేయ వ్యాధితో కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్ తనువు చాలించారు. దీంతో మాలీవిడ్ మూవీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

     ఇండస్ట్రీలో విషాద ఛాయలు..

    ఇండస్ట్రీలో విషాద ఛాయలు..

    చిత్రసీమలో నెలకొంటున్న వరుస విషాద సంఘటనలు కలిచివేస్తున్నాయి. ఇప్పటికే సీనియర్​ హీరోయిన్​ మీనా భర్త విద్యా సాగర్ మరణించగా, ఆ వెంటనే ప్రముఖ సీనియర్ ఫిల్మ్​ ఎడిటర్​ గౌతమ్​ రాజు, అనంతరం నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్​, ఆర్​ నారాయణ మూర్తి తల్లి, డైరెక్టర్ బాబీ తండ్రి మోహన్ రావు మరణించారు. వీరి మరణ వార్తలు సినీ లోకాన్ని కలిచివేశాయి. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్ (60) అనారోగ్యంతో కన్నుమూశారు.

    అసలు పేరు రామన్ అశోక్ కుమార్..

    అసలు పేరు రామన్ అశోక్ కుమార్..

    ధీర్ఘాకాలిక వ్యాధితో బాధపడుతున్న అశోకన్ కోచిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అంటే సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. అశోకన్ మరణాన్ని కేరళ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ధ్రువీకరించింది. అనేక చిత్రాలతో గుర్తింపు పొందిన అశోకన్ అసలు పేరు రామన్ అశోక్ కుమార్. కామేడీ చిత్రాల తెరకెక్కించిన ఆయన మాలీవుడ్ లో మంచి పేరు సంపాదించారు. మలయాళంలో వచ్చిన సైకలాజికల్ డ్రామా వర్ణం చిత్రంతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 1980లో శశికుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన అశోకన్.. రెండో మూవీ ఆచార్యన్ మంచి క్రేజ్ తీసుకొచ్చింది.

    మెలోడీ ఆఫ్ లోన్లీనెస్ కు అవార్డు..

    మెలోడీ ఆఫ్ లోన్లీనెస్ కు అవార్డు..

    మలయాళం కైరాలి టీవీలో ప్రసారమైన మెలోడీ ఆఫ్ లోన్లీనెస్ సినిమాతో 2003 సంవత్సరంలో ఉత్తమ టెలిఫిల్మ్ గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును సైతం గెలుచుకుంది. అయితే అశోకన్ సింగపూర్ కు మారకముందే ఇదే చివరి చిత్రం. అనంతరం వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు అశోకన్. ఆయనకు కొచ్చి, గల్ఫ్ లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అశోకన్ కు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. ఇక ఆయన మరణం పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

    English summary
    Popular Mollywood Filmmaker Ashokan Passed Away Due To Chronic Disease At Age 60 In Kochi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X