»   » సెక్స్ వెబ్ సైట్స్ ఎడ్రస్ పట్టుకోవాలంటే ఇక వెరీ ఈజీ

సెక్స్ వెబ్ సైట్స్ ఎడ్రస్ పట్టుకోవాలంటే ఇక వెరీ ఈజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

శృంగారపరమైన సైట్స్ విజిట్ చేయాలనుకునేవారు, అలాగే వాటి నుంచి తప్పించుకోవాలి అనుకునే వారికి ఓ శుభవార్త. త్వరలో పోర్న్ వెబ్ సైట్స్ కు .xxx అనే సఫెక్స్ ను ఇవ్వనున్నారు. ఈ మేరకు బ్రుసెల్స్ అనే ఏజన్సీ (ఇంటెర్నెట్ ఎడ్రస్ లను కంట్రోల్ చేస్తూంటుంది) ఓ ప్రకటన విడుదల చేసింది. రీసెంట్ గా జరిగిన చర్చల్లో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర దిసగా ప్రయాణం జరిగిందని అన్నీ అనూకూలిస్తే త్వరలోనే ఈ రకమైన సౌకర్యం అనుభవంలోకి వస్తుందని అంటోంది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత .xxx తో వచ్చే వెబ్ సెట్స్ అన్నిటినీ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ గా వ్యవహిస్తారు. ఇప్పటికే .com మరియు .org కలిగి ఉన్న పోర్న్ వెబ్ సైట్స్ కు కూడా ఆరు నెలలలోగా .xxx తో అనుసంధానమయ్యి మార్చుకునే అవకాశం కల్పిస్తారు.

ఇక ఇలా మార్చాలని 2000 నుంచి ఇప్పటికి మూడు సార్లు ప్రయత్నాలు జరిగాయని కానీ అనుకూలించలేదు. ఇలా చేస్తే పోర్న్ సైట్స్ స్ప్రెడ్ అవటం బాగా పెరుగుతుందని క్రిస్ట్రియన్ గ్రూప్స్ వారు నుంచి వచ్చే ప్రెజర్ వల్ల దీనిని ముందుకు తీసుకెళ్ళలేక పోయామంటున్నారు. ఇక ఇలా చేయటం వల్ల ఫోర్న్ వెబ్ సైట్స్ కు లాభం ఏమిటంటే ఇవి చూద్దామనుకునే కస్టమర్స్ ఈజీగా లాగిన్ కాగలుగుతారని సంస్ధ సీఈఓ చెప్తున్నారు. అయితే ఫోర్న్ కంపెనీలు మాత్రం పెద్ద ఉత్సాహం చూపటం లేదు. ఇలా చేయటం వల్ల తాము ఫోర్న్ సైట్స్ ని ప్రత్యేకంగా తెలిసిపోయి పిల్టర్స్ ద్వారా తమపై అప్రకటిత నిషేధం తరహా కొనసాగి తమ బిజెనెస్ పడిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu