హీరో గా వర్కవుట్ అవుతాడా..

By Staff

Posani Krishna Murali
రచయిత నుంచి దర్శకుడిగా,ఆపై నిర్మాతగానూ అవతారమెత్తిన పోసాని కృష్ణమురళి ఇక హీరోగానూ కనిపించబోతున్నాడు. ఈ వార్త పరిశ్రమలో చర్చలకు తావిస్తోంది. దర్శకుడిగా తొలి సినిమా 'శ్రావణమాసం' ఫెయిలైనా, రెండో సినిమా 'ఆపరేషన్ దుర్యోధన' ఊహించని విధంగా హిట్టయింది. కానీ తర్వాత నాగేంద్రబాబు ప్రధాన పాత్రలో వచ్చిన 'ఆపద మొక్కులవాడు' సినిమాతో డిజాస్టర్ అయింది. అంతేగాక సినిమా ప్రమోషన్ కోసం లేనిపోని వివాదాల్ని తెచ్చి పెట్టుకుని ఇమేజ్‌ని దెబ్బ తీసుకున్నారు. ఇక ఈ స్ధితిలో తనే హీరోగా మారాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ సినిమాకు 'ఆడవాళ్లు నవ్వితే శుభం' అనే చిత్రమైన పేరు పెట్టాడు.

ఎన్నారై మోహన్ వడ్లపట్ల నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకి ఆయనే దర్శకుడు. జూన్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇందులో మొదట ఆడవాళ్లని ఏడిపించి, అలా ఏడిస్తే అశుభాలు జరుగుతాయనీ, వారు నవ్వుతుంటేనే శుభాలు కలుగుతాయనీ ఈ సినిమా ద్వారా పోసాని చెప్పబోతున్నాడు. దీనిలోనూ ఆయన మార్క్ సెటైర్లు ఎక్కువగానే వుంటాయని తెలుస్తోంది. అయినా ఆయన సినిమాలుకి జనం ఆలోచింపచేసే పొలిటికల్ సెటైర్స్ కోసం ఉత్సాహపరిచే ఉద్రేక పూరిత డైలాగుల కోసం వెళ్తారు. ఇలా శ్రావణమాసం లాంటి మరో మహిళా ప్రధాన చిత్రంతోనూ అందులోనూ హీరోగా వస్తే కష్టమేమో మరొక్క సారి ఆయన ఆలోచించ వలిసింది అని అభిమానులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X