»   » నిన్న బాలయ్యకు వీరాభిమానిని :ఇప్పుడు నేనే బాలకృష్ణని

నిన్న బాలయ్యకు వీరాభిమానిని :ఇప్పుడు నేనే బాలకృష్ణని

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంలో హీరోని బాలయ్య ఫ్యాన్ గా చూపిన బ్యానర్ ఇప్పుడు పోసాని చేత బాలకృష్ణ అనే క్యారక్టర్ వేయిస్తోంది. ఇదే బ్యానర్ కు బాలకృష్ణుకు మంచి రిలేషన్ ఉంది. గతంలో ఇదే బ్యానర్ లో బాలకృష్ణ ..లెజండ్ అనే సూపర్ హిట్ చిత్రం చేసిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది.

ఇక పోసాని..బాలకృష్ణ అనే పాత్రలో కనిపిస్తున్నారంటూ... క్యారక్టర్స్ ఇంట్రడక్షన్ టీజర్ లో చెప్పారు. ఇంతకీ ఏం సినిమా అంటారా.. అయితే ఈ క్రింద టీజర్ ని చూడాల్సిందే.

హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం రన్. మలయాళి చిత్రం నేరం కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అనీల్ కన్నెగెంటి డైరక్షన్ లో రూపొందుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్ తో ఆకట్టుకున్న టీమ్, ఆ వెంటనే ఓ స్పెషల్ టీజర్‌ను విడుదల చేసి మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు సంబందించిన అసలు ట్రైలర్ మరో రెండు రోజుల్లో విడుదల చేస్తారు. ముఖ్యంగా ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం కావడమే సందీప్ ను ఆకర్షించిందని తెలిపారు.

Posani as Balakrishna: Sandeep Kishan's Run New Characters Teaser

అసాధ్యుడు, మిస్టర్‌ నూకయ్య తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్‌ కన్నెగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2013లో చాలా చిన్న సినిమాగా వచ్చితమిళం, మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా ‘నేరం'. నేరమ్ చిత్రం తమిళ,మయాళ భాషల్లో ఇప్పటికే విడుదలై సంచలన విజయం సాధించింది.

ఇదొక డార్క్ కామెడీ చిత్రం. నాగ చైతన్య చేస్తున్న రీమేక్... ఒరిజనల్ ప్రేమమ్ చిత్రం దర్శకుడు తొలి చిత్రం ఇది. ఈ చిత్రంతోనే అతనికి మంచి పేరు వచ్చింది. నజ్రియా నసీమ్, నవీన్ పోలి ఈ సినిమాలో చేసారు.

ఇక ఈ చిత్రాన్ని ఫిక్సెల్ ఇండియా ప్రెవేట్ లిమెటెడ్ హెడ్ చెరుకూరు సుధాకర్ ఈ సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల సుంకర సమర్పిస్తున్నారు.

English summary
Posani will be seen as Balakrishna in Sundeep Kishan and Anisha Ambrose new movie ‘Run’. It is coming as remake to Tamil hit ‘Neram’ has got the one of its kind special character introduction teaser released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu