చిరు కాపు కానీ..పోసాని

'ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుం ది. అలా అని దానిని వేలెత్తి చూప డం ఎంత వరకూ సబబు?' అంటూ ప్రశ్నించారు. చిరంజీవి కూతరు లవ్ మ్యారేజ్, పవన్ రెండో పెళ్ళి అంటున్నారని ఇవి దిగజారిన రాజకీయాలకు ప్రతీక అని విమర్శించారు. ఇక సామాజిక న్యాయం అనేది చిరంజీవే మొదలపెట్టారని మిగతా పార్టీలు ఈ రోజు ఆ పదాన్ని వల్లె వేస్తున్నాయన్నారు. అదే చిరంజీవి గీమాజిక న్యాయం అంటే వారంతా అదే అంటారని అన్నారు. ఇక ఆయన తాజాగా తీస్తున్న రాజుగారి చేపల చెరువు ఎందుకు తీస్తున్నారు..మిగతా పార్టీలను విమర్శించటానికా అంటే..ఫిల్మ్ ఫర్ పబ్లిక్ అని,ఎంటర్టైన్ మెంట్, మెసేజ్ ఉంటాయన్నారు. అలాగే తాను చీప్ విమర్శలుకు పాల్పడనని, ఏ పార్టీనీ తిట్టడానికి, తొక్కడానికి కాదని, అంతగా విమర్శలు చేయాలంటే ఏ టీవి ఛానెల్ కో వెళ్తే చాలునని, మరీ అంతగా కావాలంటే పేపర్లో వెనుకపేజీ యాడ్ ఇచ్చుకుంటానని,రెండున్నర కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన పనిలేదని తేల్చి చెప్పేసారు.


Click it and Unblock the Notifications











