చిరంజీవిని ప్రజలు చెప్పుతో కొడతారన్న పోసాని
ఇటీవల తెలంగాణ అంశం పై రాష్ట్రం అట్టుడికి పోతుంటే ధైర్యంగా ముందుకొచ్చి తన వాణి వినిపించాడనీ మొన్నీమద్య ఐ న్యూస్ ఇంటర్వ్యూలో తెలంగాణా వస్తే ఇక్కడున్న ఆంధ్రవాడిని ఇంకో రూపాయి ఎక్కువ కట్టమని అడుగరు. అలాగని తెలంగాణా వాడికి రూపాయి తగ్గించరు, ఏ రాష్ట్రం వచ్చినా మనిషి తన తెలివి తేటల మీదే బతకాల్సి వుంటుంది. ఈ కారణంగా ప్రజలు కన్ ఫ్యూజన్ కి గురికావల్సిన అవసరం లేదు..ఇదో పనికి మాలిన అంశం ఇంకా నిర్మాణాత్మక అంశాలు రాష్ట్రంలో ఇంకెన్నో ఉన్నాయి అంటూ కితాబు ఇచ్చిన పోసాని ప్రజారాజ్యం పార్టీలో ఉంటూ ఇప్పుడు చిరంజీవి గురించి ఇన్ డైరెక్ట్ గా విమర్శంచండం మొదలెట్టాడు.
తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో రాజకీయ నేతలు అనుసరిస్తున్న తీరుపై సినీదర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్రంగా స్పందించారు. నాయకుల అవకాశవాద రాజకీయాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని, ఏ పార్టీ వారైనా ఒకే మాటపై నిలబడాలని, ఒకప్పుడు జైతెలంగాణా అని ఇప్పుడు నై తెలంగాణా అంటే కొట్టారా అని పరోక్షంగా 'చిరు"ని దెబ్బిపొడిచాడు. సమైక్యవాదం అన్నప్పుడు సమైక్యవాదానికి, తెలంగాణ వాదం అందుకున్నప్పుడు తెలంగాణ వాదానికే కట్టుబడి ఉండాలని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో కొన్ని సినిమాలను అక్కడి వారు నిలిపి వేయడంపై ఆయన స్పందిస్తూ రోజుకో ప్రకటన చేస్తే చెప్పుతో కొడతారన్నారు.


Click it and Unblock the Notifications











