ఆర్ నారాయణమూర్తితో పోసాని
ఆపరేషన్ దుర్యోధన అనూహ్య విజయంతో ఊపిరిపోసుకున్న పోసాని కృష్ణమురళి ఆ వెంటనే నాగబాబు హీరోగా ఆపదమొక్కులవాడు సినిమా రూపొందిస్తున్నాడు. మరిన్ని సినిమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. తాజాగా ఆర్ నారాయణమూర్తితో విప్లవ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడు. ఆపదమొక్కులవాడు సినిమా పూర్తవగానే నారాయణమూర్తి హీరోగా సినిమా చేయనున్నాడు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టడం, వరికి మద్ధతు ధర తదితర అంశాల ఆధార కథనంతో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











