పోసాని రాసలీలలు బయటపెట్టిన నిర్మాత.. సాక్ష్యాలతో నీ వ్యభిచారం అంటూ గుట్టువిప్పిన ప్రొడ్యూసర్ శ్రీనివాస్

సినీ రచయిత, నటుడు, దర్శకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త పోసాని కృష్ణమురళీ మంగళవారం హైదరాబాద్‌ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశం అత్యంత వివాదాస్పదంగా మారింది. పవన్ కల్యాణ్ తల్లి, భార్య, చెల్లెలు, కూతురుపై పోసాని చేసిన వ్యాఖ్యలను అన్ని వర్గాల వారు తప్పుపడుతున్నారు. తాజాగా పోసాని కృష్ణమురళీతో పోసాని జెంటిల్మన్ అని మూవీ తీసిన నిర్మాత నల్లం శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. యూట్యూబ్‌ వీడియోను రిలీజ్ చేసిన ఆయన.. ప్రముఖ ఛానెల్‌తో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. నిర్మాత నల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ..

చిరంజీవి కాళ్ల వద్ద పడి ఉన్నాడనే..

చిరంజీవి కాళ్ల వద్ద పడి ఉన్నాడనే..

పోసానిపై మాటల్లో చెప్పలేని పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో నేను పోసాని నటించిన మెంటల్ కృష్ణ, రాజవారి చేపల చెరువు సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆ సినిమాల్లో భారీ నష్టం వచ్చింది. పోసాని వెధవ అని తెలిసినా.. చిరంజీవి కాళ్ల వద్ద బతుకుతున్నాడు అనే ఒకే ఒక కారణంతో 2010లో ఆయనతో పోసాని జెంటిల్మన్ అనే సినిమా తీశాను అని నల్లం శ్రీనివాస్ తెలిపారు

పోసాని జెంటిల్మన్ సినిమా షూటింగ్ సమయంలో

పోసాని జెంటిల్మన్ సినిమా షూటింగ్ సమయంలో

పోసాని కృష్ణమురళీ లాంటి వెధవ గురించి మాట్లాడే అర్హత నాకే ఉంది. పోసాని జెంటిల్మన్ సినిమా సమయంలో నన్ను దారుణంగా మోసగించాడు. సినిమా పరిశ్రమలో నీతి గురించి నీవు మాట్లాడుతున్నావా? పోసాని జంటిల్మన్ సినిమా షూటింగులో ఎంత మంది అమ్మాయిలతో రాసలీలలు చేశావో బయటపెట్టాలా? మంచి సినిమా చేస్తానని చెప్పి డీ గ్రేడ్ సినిమా తీసి నా చేతిలో పెట్టావు. నీలాంటి వాడిని నమ్మడమే నేను చేసిన తప్పు అని నిర్మాత నల్లం శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్మాతల గురించి మాట్లాడేది నువ్వా?

నిర్మాతల గురించి మాట్లాడేది నువ్వా?

పోసాని జంటిల్మన్ సినిమా రిలీజ్‌కు ఫైనాన్స్ పరంగా సమస్యలు వస్తే.. నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు. నీ ఇంటి వద్దకు చాలా మంది వస్తే కనీసం ఇంట్లోనే ఉండి పలకరించలేదు. నీవు నిర్మాతల గురించి, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతావా? ఆ సినిమా ప్రమోషన్‌కు వచ్చావా? నీవు నిర్మాతల గురించి మాట్లాడుతున్నావా? అని నల్లం శ్రీనివాస్ తెలిపారు.

పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ గురించి

పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ గురించి

పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ గురించి నీవు ప్రశ్నిస్తావా? రోజుకు, లక్ష, రెండు లక్షలు నీవు వసూలు చేయడం లేదా? పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ తీసుకొని ట్యాక్స్ కడుతున్నాడు. అది నీకేమైనా నష్టమా? సినిమా టికెట్ల గురించి పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే తప్పుపడుతావా? నాలాంటి నిర్మాతల గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సర్కారు టికెట్లు అమ్మి సొమ్ము దగ్గర పెట్టుకొంటే నిర్మాత పరిస్థితి ఏం కావాలో ఆలోచించావా? అంటూ నల్లం శ్రీనివాస్ ప్రశ్నల వర్షం కురిపించారు.

నీ వ్యభిచారం బయటపెట్టాలా?

నీ వ్యభిచారం బయటపెట్టాలా?

నీ గురించి తెలియని సమయంలో నీ వద్దకు వచ్చి మోసపోయాను. చిలకలూరిపేటలో నీ ఇల్లు కూలగొట్టుకొని.. మరొకరికి అమ్మి మోసం చేసిన విషయం బయటపెట్టాలా? పబ్లిక్‌లోకి వచ్చి నీతులు చెబితే నమ్ముతారని అనుకొంటావా? అమ్మాయిల గురించి నువ్వు మాట్లాడటం దారుణం. నా కళ్ల ముందు చేసిన వ్యభిచారం గురించి బయటపెట్టాలా? నాకు సంస్కారం ఉంది కనుక అమ్మాయిల పేర్లు బయటపెట్టడం లేదు అని నల్లం శ్రీనివాస్ హెచ్చరించారు.

Recommended Video

Street Light Movie Trailer
అమ్మాయిని ఒడిలో కూర్చో పెట్టుకొని అంటూ

అమ్మాయిని ఒడిలో కూర్చో పెట్టుకొని అంటూ

పోసాని జెంటిల్మన్ సినిమా సమయంలో నాకు రెండు పాటలు రాసిన రచయితకు 5 వేలు ఇవ్వడానికి నెలలపాటు తిప్పించుకొన్నావు. ఇంకా నీ మోసాల గురించి బయపెట్టాలా? షూటింగులో ఒక అమ్మాయిని ఒడిలో కూర్చోపెట్టుకొని రచయితను పాట పడమని చెప్పలేదా? ఆ విషయాన్ని సాక్ష్యాలతో బయటపెట్టాలా అంటూ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నల్లం శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X