మెంటల్ కృష్ణ ఇమేజ్ తో ముందుకెళ్తున్న పోసాని తాజాగా తింగరోడు అనే చిత్రాన్ని కమిట్ అయ్యాడు. ఈ చిత్రంలో అందరిచేత తింగరోడు అనిపించుకున్నా ఫైనల్ గా మంచి చేసే మహా మంచోడు క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కామిడీ చిత్రాలు తీసి రెస్ట్ తీసుకుంటున్నకె.వాసు డైరక్ట్ చేస్తున్నారు. ఇక పోసాని సరసన శ్రధ్దా ఆర్య హీరోయిన్ గా చేస్తోంది. బయిట బ్యానర్స్ నుంచి పోసానికి హీరోగా ఆఫర్స్ రావటం శుభ సూచకమేనంటున్నారు సినీ జనం. అయితే ప్రస్తుతం పోసాని జెంటిల్ మెన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఆర్తి అగర్వాల్ ప్రధానపాత్రలో చేస్తున్న ఈ చిత్రంలో పోసాని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉమనైజర్ గా కనిపించనున్నారు. అప్పట్లో వచ్చిన కమల్ హాసన్ మన్మధలీలలు చిత్రం ఆధారంగా ఈ కథ రెడీ అయినట్లు సమాచారం. ఇక రాజువారి చేపల చెరువు వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకునే జెంటిల్ మేన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడంటున్నారు. చూద్దాం ఈ మెంటల్ కృష్ణ..జెంటిల్ మ్యాన్ అనిపించుకుంటాడో తింగరోడు గా సెటిల్ అవుతాడో.