Bro Dance: సీనియర్ ఎన్టీఆర్‌తో అంబటి రాంబాబును పోల్చిన పోసాని.. ఏం పీకారంటూ!
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు పోసాని కృష్ణమురళి. నెగెటివ్ రోల్స్ తో సినిమా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన కమెడియన్ గా, దర్శకుడిగాతనదైన మార్క్ చూపించారు. ఐలవ్యూ రాజా అంటూ తనదైన స్టైల్ లో కామెడీ చేసి అలరించిన పోసాని ఆపరేషన్ ధుర్యోదన వంటి సినిమాతో ఆలోచింపజేశారు. ప్రస్తుతం సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు సాగుతున్న ఆయన తాజాగా తమిళ నటులు, చిత్రపరిశ్రమపై వ్యాఖ్యలు చేశారు. అలాగే బ్రో (Bro Movie) సినిమాలో శ్యాంబాబు డ్యాన్స్ వీడియోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నష్టపోయింది లేదు: "తమిళ వాళ్లు.. ఇక్కడి తెలుగు వాళ్లను అన్నదమ్ముల్లలాగా, అక్క చెళ్లెల్లలాగా చూస్తారు. చాలా చాలా మంచివారు. 37 ఏళ్లలో ఏ ఒక్క తమిళ సోదరుడి వల్ల నేను బాధపడింది లేదు. నష్టపోయింది లేదు. ఏడ్చింది లేదు. కోప్పడింది లేదు. అర్ధరాత్రి ఆటో అడిగితే ఒక తమిళియను అన్నా ఎక్కడికి వెళ్లి అని తమిళంలో మాట్లాడి అక్కడ దింపుతాడు. అక్కడి నుంచి మిడ్ నైట్ 1 గంటకు మా రూమ్ కు తీసుకొస్తాడు" అని పోసాని కృష్ణమురళి అన్నారు.

తెలుగోళ్లు ఉన్నారుగా: "ఒక్కసారి కూడా తమిళ సోదరుల వల్ల మేం నష్టపోయింది లేదు లేదు లేదు. ఇది కరెక్ట్ కాదు. చాలా మంది తెలుగు వాళ్లు తమిళంలో సూపర్ స్టార్స్ అయ్యారు. డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆంధ్ర అతనే. అక్కడ పెద్ద పెద్ద హిట్లు తీశాడు. వాళ్లు ఇచ్చారు కదా. ఇప్పటికీ అక్కడ తెలుగు వాళ్లు చాలా మంది ఉన్నారుగా. ఆ చాంబర్ లో తెలుగోళ్లు ఉన్నారుగా. తెలుగు డైరెక్టర్లు ఉన్నారు. తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు" అని పోసాని కృష్ణమురళి తెలిపారు.

చాలా ప్రేమగా చూస్తారు: "తమిళ వాళ్లు అలా అంటారని అంటే మాత్రం నేను సమర్ధించను. అక్కడ ఉన్న తెలుగు వాళ్లను తమిళవాళ్లు ఎంత ప్రేమించారో మాటల్లో చెప్పలేం. తమిళవాళ్లను అనడం మాత్రం చాలా తప్పుడు విధానం. వాళ్లు చాలా చాలా ప్రేమగా చూస్తారు. తమిళనాడులో లక్షల మంది ఉన్నారు తెలుగు వాళ్లు" అని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.

నేను కూడా అంటా: "తమిళవాళ్లకే తొలి ప్రాముఖ్యత ఇవ్వాలి. లేకుంటే బహిష్కరిస్తాం అని సెల్వమణి స్వయంగా చెప్పారు" అని యాంకర్ అడిగితే.. "అతను ఏ సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు తీస్తున్నాడా. అది తప్పు. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ కాదు. కళ ఎక్కడుంటే అక్కడ. ఎవరో ఒకరు అంటారు. నేను కూడా అంటా. నేను అంటే తెలుగు ఇండస్ట్రీ మొత్తం అన్నట్లా" అని పోసాని ప్రశ్నించారు.
చాలా గొప్పది: "అతను అనడం అతని అభిప్రాయం అంతే. ఇండస్ట్రీ అన్నట్లు కాదు. అలాంటివి అనుకుంటే అనుకోని. దాంట్లో తప్పేముంది. నాజర్ గారు చెప్పారుగా ఇలాంటి మా దగ్గర లేవు అని. రజనీ కాంత్, విజయ్, కమల్ హాసన్ వాళ్ల దగ్గర అలా ఉందా. తెలుగు యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు అక్కడ. అంతా ఈ ఫిటింగ్ ల కోసమే. మేము ఇలా మాట్లాడటానికి. తమిళ పరిశ్రమ చాలా గొప్పది. ఆర్టిస్ట్, డైరెక్టర్స్ వాళ్లంతా వెరీ గుడ్ పీపుల్" అని పోసాని పేర్కొన్నారు.

ఏం పీకారు..: బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ వైరల్ అవుతుంది. దానిపై రియాక్షన్ ఏంటని అడిగితే.. "ది గ్రేట్ ఎన్టీ రామారావు ఉన్నారు. ఆయన పాత్రను పెట్టి కిందకు తెచ్చేలా సినిమాలు చేశారు. తీసి ఏం పీకారు. ఇది అంతే పీకడం" అని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. అయితే అంబటి రాంబాబును సీనియర్ ఎన్టీఆర్ తో పోల్చడంపై నెటిజన్లు, అభిమానులు పోసానిపై ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











