»   » లేపుకొస్తే నేనే పెళ్లి చేశా..... రవితేజ తమ్ముడు భరత్ గురించి పోసాని!

లేపుకొస్తే నేనే పెళ్లి చేశా..... రవితేజ తమ్ముడు భరత్ గురించి పోసాని!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన, ఆ తర్వాత అంత్యక్రియల విషయంలో జరిగిన పరిణామాలు అందరినీ కలిచి వేసింది. భరత్ అంత్యక్రియలకు కూడా హాజరు కానీ రవితేజ, ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వీలైనంత దూరంగా ఉంటున్నారు.

  దీంతో భరత్ గురించిన వ్యక్తిగత విషయాలు బయటకు రావడం లేదు. భరత్ వివాదాస్పద జీవితం(డ్రగ్స్ కేసు, డ్రంక్ అండ్ డ్రైవ్) గురించి మాత్రమే తెలుసు. అతడి వైవాహిక జీవితం గురించి ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీలో కొంతమందికి తెలిసినా సైలెంటుగానే ఉంటున్నారు.

  ఓ వైపు తమ్ముడి విషాదం... మరో వైపు షూటింగుకు హాజరైన రవితేజ!

  అయితే గతంలో భరత్ గురించి ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూ విశేషాలను మరోసారి గుర్తు చేసుకుంటే భరత్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

  ఓ అమ్మాయిని లేపుకొచ్చాడు

  ఓ అమ్మాయిని లేపుకొచ్చాడు

  ఓసారి భరత్‌ ఓ అమ్మాయిని ప్రేమించి, లేపుకొచ్చి తనను ఇబ్బందుల్లో పడేసినట్లు పోసాని గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. దాదాపు ఇరవైయ్యేళ్ల క్రితం తాను పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంటుగా పని చేస్తున్న రోజుల్లో ఇది జరిగిందని తెలిపారు.

  అపుడు ఏం జరిగిందంటే...

  అపుడు ఏం జరిగిందంటే...

  పరుచూరి బ్రదర్స్ వద్ద పని చేస్తున్న రోజుల్లో వారి ఇంటి ఆవరణలోనే ఓ గదిలో పోసాని ఉండేవారు. ఓ రాత్రి హైదరాబాద్ నుండి ఓ అమ్మాయితో పారిపోయి చెన్నై వచ్చిన భరత్...పోసాని సహాయం కోరాడట. ఆ రాత్రి భరత్ పరిస్థితి చూసి తన రూమ్ వారికి ఇచ్చి తను వేరేచోట పడుకున్నారట.

  అప్పటికి రవితేజ హీరో కాలేదు

  అప్పటికి రవితేజ హీరో కాలేదు

  రవితేజ అప్పటికి ఇంకా హీరో కాలేదు... చిన్న చిన్న వేషాలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నాడు. అపుడు ఇంకా రవితేజ కూడా పోసానికి పరిచయం లేదట.

  భరత్ వల్ల పోసాని ఔట్

  భరత్ వల్ల పోసాని ఔట్

  పోసానికి కేటాయించిన ఇంట్లో అమ్మాయి కనిపించడంతో వీరు ఇక్కడ ఏదో తప్పుడు పనులు చేస్తున్నారని అనుమాన పడిన పరుచూరి కుటుంబ సభ్యులు గొడవ చేశారని, పోసానిని బయటకు పంపేసారని, ఆ విధంగా భరత్ ప్రేమ వ్యవహారం తనకు పరుచూరి బ్రదర్స్ వద్ద ఉపాధిని లేకుండా చేసిందని పోసాని అప్పట్లో వివరించారు.

  మళ్లీ పరుచూరి బ్రదర్స్ ఇంటి మెట్లు ఎక్కలేదు

  మళ్లీ పరుచూరి బ్రదర్స్ ఇంటి మెట్లు ఎక్కలేదు

  కనీసం ఏం జరిగిందో కూడా వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా తనను బయటకు పంపేశారు. ఆ తర్వాత తను ఎప్పుడూ పరుచూరి ఇంటి మెట్లు ఎక్కలేదని పోసాని అప్పట్లో చెప్పుకొచ్చారు.

  భరత్ పెళ్లి వివాహాలు

  భరత్ పెళ్లి వివాహాలు

  భరత్ తీసుకొచ్చింది డబ్బున్న ఇంటి అమ్మాయి అని, వారి పెళ్లి తామే చేశామని....అప్పట్లో పోసాని తెలిపారు. ఆ తర్వాత వీరు విడిపోయారని తెలుస్తోంది. అయితే భరత్‌కు నాలుగేళ్ల క్రింద మరో పెళ్లి జరిందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారు విడిగానే ఉంటున్నారని టాక్.

  English summary
  Posani Krishna Murali about Bharath's Love Marriage. Posani became jobless because of Bharath. Still, He helped Bharath get married to the girl. This episode happened almost 25 years ago when Raviteja was in a struggling phase. Which means, Bharath's Love Marriage was unsuccessful and even his second marriage failed.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more