రెండు నెలల పాటు చిరంజీవి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.. అదొక రాజకీయ కుట్ర: పోసాని

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోట్లాది మంది అభిమాన బలంతో మెగాస్టార్ తనపై ఏనాడు కూడా మచ్చ తెచ్చుకోలేదు. ఇక ఆయనను దెబ్బకొట్టడానికి చాలా మంది ట్రై చేశారని నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వివరణ ఇచ్చాడు. ముఖ్యంగా మెగాస్టార్ రెండు నెలలపాటు నరకం అనుభవించిన విషయం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

చిరంజీవిని ఎలా ఎదుర్కోవాలో తెలియకనే

చిరంజీవిని ఎలా ఎదుర్కోవాలో తెలియకనే

పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకానొక సందర్భంలో తీవ్ర స్థాయిలో కన్నీరు పెట్టుకున్నారు. ఆ విషయం నాకు బాగా గుర్తుంది. అందుకు కారణమైన వాళ్ళు కూడా నాకు తెలుసు. చిరంజీవిని రాజకీయాల్లో ఎలా ఎదుర్కోవాలో తెలియకనే అలా చేశారు. ఆ వ్యక్తి మరెవరో కాదు. చంద్రబాబు నాయుడే..

చంద్రబాబు ఒక లేడి పొలిటీషియన్ తో కలిసి..

చంద్రబాబు ఒక లేడి పొలిటీషియన్ తో కలిసి..

చంద్రబాబు, చాలా సందర్భాల్లో చిరంజీవిని పర్సనల్ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. వాళ్ల కుటుంబాన్ని తిట్టించాడు. కుటుంబ విషయాల గురించి మాట్లాడుతూ రోడ్డుకు లాగారు అని చిరంజీవి మనోవేదనకు గురయ్యారు. చంద్రబాబు ఒక లేడి పొలిటీషియన్ తో కలిసి ఒక ప్లాన్ వేశాడు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడించాడు.

చిరంజీవి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళనే కంట్రోల్ చేయలేడు

చిరంజీవి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళనే కంట్రోల్ చేయలేడు

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉన్న తన ఆడవాళ్ళనే కంట్రోల్ చేయలేడు. అలాంటిది ఒక ప్రజా నాయకుడిగా ప్రజలను ఎలా కంట్రోల్ చేస్తాడని ఆ మహిళతో చంద్రబాబు చెప్పించాడు. సాధారణంగా చాలా ఇళ్లల్లో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవడం సహజమే. నచ్చకపోతే విడాకులు కూడా తీసుకుంటారు. కామన్ గా ప్రతి ఇళ్లల్లో జరిగేది ఇది.

రెండు నెలలపాటు ఆ బాధను తట్టుకోలేక..

రెండు నెలలపాటు ఆ బాధను తట్టుకోలేక..

అంతెందుకు.. ఎన్టీఆర్ ఇంట్లో జరగలేదా? కేవలం చిరంజీవిని టార్గెట్ చేసి ఆయన ఇంట్లోనే వెలుపెట్టి చూపించారు. ఒక తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. రెండు నెలలపాటు ఆ బాధను తట్టుకోలేక తీవ్రంగా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఎంతగానో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఆ విధంగా చేస్తారని ఆయన కలలో కూడా ఉహీంచలేదు. అప్పుడు నేనే టీడీపీ నేతల నోళ్లు మూయించాను.. అని పోసాని కృష్ణ మురళి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X