పోసాని ‘ఆపరేషన్ వెర్రిపువ్వు’ హాట్ టాపిక్... పవన్‌కు ముప్పు, ఎన్టీఆర్‌నూ తొక్కేస్తారట!
నటుడు శివాజీ గతంలో 'ఆపరేషన్ గరుడ' పేరుతో ఢిల్లీ నుంచి కుట్ర జరుగుతుందంటూ సంచలన విషయాలు బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద కత్తితో దాడి జరుగడంతో శివాజీ చెప్పిన 'ఆపరేషన్ గరుడ' నమ్మాల్సి వస్తోందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వ్యానించడంతో నటుడు పోసాని కృష్ణ మురళి రంగంలోకి దిగారు. ఆయన తాజాగా 'ఆపరేషన్ వెర్రిపువ్వు'ను తెరపైకి తెచ్చారు.

‘ఆపరేషన్ వెర్రి పువ్వు' హాట్ టాపిక్
పోసాని చెప్పిన ‘ఆపరేషన్ వెర్రిపువ్వు' అంశం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఢిల్లీ నుంచి పప్పు అనే వ్యక్తి నాకు ఇందుకు సంబంధించిన సమాచారం అందించారంటూ పోసాని వ్యాఖ్యానించడం గమనార్హం.

పవన్ పాపులారిటీ తగ్గించడమే లక్ష్యం
పవన్ కళ్యాణ్ పాపులారిటీ తగ్గించడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ వెర్రిపువ్వు' జరుగుతుందని పప్పు అనే వ్యక్తి నాకు సమాచారం అందించారని, అయితే తనకు పప్పు ఎవరో తెలియదని పోసాని తెలిపారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి కూడా పవన్ కళ్యాణ్‌ను మోసం చేయడం కూడా ‘ఆపరేషన్ వెర్రిపువ్వు'లో భాగమే అని పోసాని తెలిపారు.

జూ ఎన్టీఆర్‌నూ తొక్కేస్తారట
జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రాకుండా ఎలా అడ్డుకోవాలి? ఆయన్ను పొలిటికల్‌గా ఎలా తొక్కేయాలి? అనేది కూడా ‘ఆపరేషన్ వెర్రిపువ్వు'లో భాగమే అని పోసాని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

అది నమ్మితే ఇదీ నమ్మాల్సిందే
శివాజీ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ' నిజమని ఎవరైతే నమ్ముతారో.... నేను చెప్పిన ‘ఆపరేషన్ వెర్రిపువ్వు' ను కూడా నమ్మాల్సిందే. అతడి లాగే నాక్కూడా ఢిల్లీ నుంచి సమాచారం వచ్చింది అంటూ పోసాని తనదైన శైలిలో విరచుకుపడ్డారు.


Click it and Unblock the Notifications











