twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆంధ్రావారిని తెలంగాణలో కొడుతున్నారా? విధ్వేషాలు రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్: పోసాని ఫైర్

    |

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల భీమవరం సభలో మాట్లాడుతూ... తెలంగాణ ఏమైనా పాకిస్థానా? కేసీఆర్ హైదరాబాద్‌లో మనోళ్ల భూములు తీసుకుంటారా? ఎలా తీసుకుంటారో నేనూ చూస్తా... తెలంగాణలో ఆంధ్రులు రాజకీయం చేస్తే తప్పా? కేసీఆర్ మాత్రం ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టవచ్చా? పోన్లే అని చూస్తుంటే ఎక్కి తొక్కుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాదు... తెలంగాణలో ఏపీ ప్రజలను ఆంధ్రోళ్లు ఆంధ్రోళ్లు అంటూ తరిమి కొడుతున్నారని, ఈ సంగతి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్‌ను భుజం మీద ఎత్తుకున్నాడంటూ... పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

    ఒకప్పుడు కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకొమ్మని చెప్పిన పవన్ కళ్యాణ్

    ఒకప్పుడు కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకొమ్మని చెప్పిన పవన్ కళ్యాణ్

    ఒకప్పుడు కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకొమ్మని పవన్ కళ్యాణ్ చెప్పారు. కేటీఆర్‌ను వాటేసుకుని తనకు అనుకూలంగా వాడుకున్నారు. కవితను చెల్లమ్మా అంటూ విష్ చేశారు.... కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ జగన్‌ను టార్గెట్ చేయడం కోసం మరోలా మాట్లాడుతున్నారని... పోసారి ఫైర్ అయ్యారు.

    ఓట్ల కోసం ఆంధ్రా వారిని రెచ్చగొడతావా?

    ఓట్ల కోసం ఆంధ్రా వారిని రెచ్చగొడతావా?

    నువ్వు తెలంగాణకు వచ్చినపుడు కేసీఆర్‌ ఇంటికి వెళ్లి, కేటీఆర్‌ను వాటేసుకుని సన్నిహితంగా ఉంటావా? నాలుగు ఓట్ల కోసం ఆంధ్ర వెళ్లిపోయి ఆంధ్రవాళ్లను తెలంగాణలో కొడుతున్నారు అంటూ అక్కడ ప్రజలను రెచ్చగొడతావా? అంటూ పోసాని మండి పడ్డారు.

    పవన్ కళ్యాణ్.. నువ్వంటే నాకు చాలా గౌవరం, కానీ...

    పవన్ కళ్యాణ్.. నువ్వంటే నాకు చాలా గౌవరం, కానీ...

    పవన్ కళ్యాణ్.. నువ్వంటే నాకు చాలా గౌవరం. నువ్వు మా సినిమా కుటుంబీకుడివి, టాప్ హీరోవు. నీ మాట నేను నమ్ముతా. నువ్వు చెబుతున్నట్లు కేసీఆర్ గారు ఆంధ్ర వాల్ల భూములు ఎక్కడ కబ్జా చేశారో? ఎవరినీ బెదిరించారో? ఒక సెంటు భూమి ఆంధ్రవాళ్లని బెదిరించి లాక్కున్నారని నిరూపిస్తే మీకు పాదాభివందనం చేస్తా.... అని పోసాని వ్యాఖ్యానించారు.

    ఎక్కడ ఎవరిని కొట్టారో చూపించు

    ఎక్కడ ఎవరిని కొట్టారో చూపించు

    ఆంధ్ర వాళ్లను కొడుతున్నారు, తరిమి కొడుతున్నారు, విసుగు పుడుతోంది అని అంటున్నావు కదా... ఎన్నిసార్లు తెలంగాణ బిడ్డలు ఆంధ్రవాళ్ల ఇళ్లకు వెళ్లి జుట్టుపట్టి బయటకు లాగి తరిమి తరిమి కొట్టారో ఒకసారి మీరు చెప్పాలి. తెలంగాణలోని ఏ జిల్లాలో కొట్టారో? కూడా చెబితే బావుంటుంది. అలా దాడికి గురైన ఆంధ్ర కుటుంబం ఒక్కటి చూపించండి, మీ పాదాలకు దండం పెడతా.... అంటూ పోసాని చెప్పుకొచ్చారు.

    ఇది నీకు న్యాయంగా ఉందా?..

    ఇది నీకు న్యాయంగా ఉందా?..

    పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టే ముందు మాది స్పష్టమైన పార్టీ, మిగతా రాజకీయ పార్టీల్లా కాదు, అందరిలా మాట్లాడను, కమర్షియల్ రాజకీయ నాయకుడిని కాదు అని చెబితే చాలా ఆనంద పడ్డాను. కానీ ఇక్కడ ఏమీ జరుగకుండా.. అక్కడ ఓటు కోసం ఇలా మాట్లాడటం ఏమైనా న్యాయంగా ఉందా? ఇక్కడికి వచ్చి కేటీఆర్‌ను వాటేసుకుంటావు, కవితను చెల్లమ్మా అని ట్వీట్ చేస్తావు. అక్కడ భీమవరంలో గెలవడం కోసం నీకు ఓట్లు రావడం కోసం ఆంధ్రవాళ్లను కొడుతున్నావని స్టేట్మెంట్ ఇస్తావా? ఇది నీకు న్యాయంగా ఉందా?.... అంటూ పోసాని ప్రశ్నించారు.

    ప్రూఫ్ చూపిస్తే నేను కూడా ఇక్కడి నుంచి పారిపోయి అంధ్రా వస్తా

    ప్రూఫ్ చూపిస్తే నేను కూడా ఇక్కడి నుంచి పారిపోయి అంధ్రా వస్తా

    1984 నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నా, తెలంగాణ మొత్తం తిరిగా, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను విమర్శిస్తూ వ్యాసాలు రాశాను. ఏ ఒక్క తెలంగాణ బిడ్డ నన్ను కొట్టలేదు. కేసీఆర్ నా ఇంటర్వ్యూ చూసి లైట్ తీసుకున్నారు. మరి ఎవరు ఆంధ్రా వాళ్లను కొట్టారో ప్రూఫ్ ఇవ్వండి. ప్రూఫ్ చూపిస్తే నేను కూడా ఇక్కడి నుంచి పారిపోయి అంధ్రా వస్తా.... అని పోసారి తెలిపారు.

    తెలంగాణ నడిఒడ్డున ఆంధ్రవాడిని చంపారు!

    తెలంగాణ నడిఒడ్డున ఆంధ్రవాడిని చంపారు!

    ఎందుకు ఇలా విధ్వేషాలు రెచ్చగొడుతున్నావ్ పవన్ కళ్యాణ్ అంటూ... పోసారి మండి పడ్డారు. నువ్వు చెప్పిన వాటిలో ఒకటి మాత్రం నిజం. తెలంగాణ నడిఒడ్డులో ఒక ఆంధ్రవాన్ని చంపేశారు. చంపిన వారు ఎవరో తెలుసా? ఆంధ్రావాడే... చచ్చిపోయిన ఆంధ్రవాడు ఎవరో తెలుసా? ది గ్రేట్ ఎన్టీ రామారావు. చంపిన ఆంధ్రవాడు ది గ్రేట్ చంద్రబాబు నాయుడుగారు. ఆయన చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు కాదా? పవన్ కళ్యాణ్ ఈ విషయం చెప్పడం లేదేమిటి?.. అంటూ పోసాని తనదైన శైలిలో విమర్శలు సంధించారు.

    English summary
    Posani Krishna Murali present about Pawan Kalyan ugly politics in Andhra electioms. Posani Krishna Murali is an Indian screenwriter, actor, director and producer who primarily works in Telugu cinema. He worked as a writer for over 150 Telugu films and directed a number of films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X