Posani Krishna Murali Arrest : పోసాని కృష్ణ మురళీ అరెస్ట్... ఎందుకు? కేసు ఏమిటీ?

నటుడు పోసాని మురళీ కృష్ణను ఏపీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. గతంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన ఫిర్యాదుల కారణంగా కృష్ణమురళీని ఏపీ పోలీసులు నిన్న సాయంత్రం ఆయన నివాసంలోనే ముందస్తు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేశారు. సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు పొలిటికల్ గానూ ఆయన యాక్టివ్ గానే కనిపిస్తూనే ఉంటారు. కృష్ణ మురళీ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వైసీపీకి అనుకూలంగా తన గళం వినిపించారు.

ఇక గత ఎన్నికల్లో పరిస్థితులు తారుమారవ్వడంతో ఆయన బాధ్యతల నుంచి రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. కానీ గతంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే ప్రస్తుతం ఫలితాన్ని అనుభవిస్తున్నారు. గత వైసీపీ హయాంలో పోసాని కృష్ణ మురళీ టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేనా పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పర్సనల్ గానూ అటాక్ చేశారు.

Posani Krishna Murali Arrested by Ap Police Here is full details why they arrested him

దీంతో పలువురు టీడీపీ నేతలు, జనాసేనా అభిమానులు పోసానిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ కేసులను విచారిస్తున్న అధికారులు తాజాగా పోసాని కృష్ణ మురళీని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిదే. రీసెంట్ గానే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ పై అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే వైపీసీకి వత్తాసు పలికి, మాటల తూటాలు పేల్చిన కృష్ణ మురళీని పోలీసులు నిన్న రాత్రి ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు.

గచ్చిబౌలి రాయందుర్గంలోని మైహోంభుజా అపార్ట్ మెంట్ లో పోసాని కృష్ణ మురళీ ఓ అపార్ట్ మెంట్ లో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. రాయందుర్గం పోలీసుల సహకారంతోనే పోసాని కృష్ణ మురళీని ఆయన నివాసంలోనే ఏపీ రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. పోసానికి ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పినా ఎలాంటి ఎక్స్ క్యూసెస్ లేకుండా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. ప్రస్తుతం పోసానిని రాజంపేటకు తరలించినట్టు తెలుస్తోంది. అక్కడే ఆయన్ని పోలీసులు విచారిస్తారని సమచారాం.

పోసాని మురళీ కృష్ణపై ఏపీ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు ను నమోదు చేశారు. సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కులాల పేరుతో దూషించడం, వర్గ విభేదాలు సృష్టించారనే ఫిర్యాదులతో ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రాజంపేటకు తరలించిన కృష్ణ మురళీని అడిషినల్ మెజిస్ట్రేట్ ముందుకు హాజరపర్చనున్నారు. అయితే కృష్ణ మురళీ అరెస్ట్ వ్యవహరం అంతా చాలా సైలెంట్ గా జరిగింది. ఉదయం నుంచి పోలీసులు గోప్యంగా ఆరాతీస్తూ పోసాని అందుబాటులో ఉన్న సమయంలో అరెస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X