మెంటల్ కృష్ణ తర్వాత చిత్రం పిచ్చోడట..!?
రచయిత నుంచి దర్శకునిగా మారి ఆ తర్వాత నటుడిగా మారిన పోసాని కృష్ణ మురళీ మరో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈసారి పిచ్చివాడిగా నటిస్తున్నాడు. గతంలో భార్యను హింసించే శాడిస్టుగా జీవించిన పోసాని ఈసారి పిచ్చివాడిగా బాగా రాణించారని దర్శకుడు జి. శంకర్ అంటున్నాడు.
శివశంకర్ ప్రొడక్షన్స్‌పై ఓ మంజుల కథ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అందమైన ఆడపిల్ల శీలాన్ని దోచుకుని ఆ తర్వాత ఆమె జీవితాన్ని నాశనం చేసిన ఓ రియల్ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని దర్శకుడు చెప్పారు.
ఇందులో పోసాని పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోదగిందనీ అంటూ ఇటువంటి పాత్రను ఆయనే చేయగలరని కితాబిచ్చారు. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తున్నామని నిర్మాత పి.వి. రావు చెప్పారు. తనూరాయ్.
More from Filmibeat
మెంటల్ కృష్ణ పోసాని కృష్ణమురళీ తనూరాయ్ పివి రావు జి శంకర్ mental krishna posani krishnamurali thanu rai pv rao g shankar


Click it and Unblock the Notifications











