సాక్షి ఎఫెక్ట్...సైకోగా మారిన పోసాని
రచయిత నుంచి దర్శకుడిగామారిన పోసాని కృష్ణ మురళి.....డైరెక్షన్లో రాణిస్తూనే.... అప్పుడప్పుడు సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పోసాని 'సాక్షి" అనే పేరుతో రూపొందుతున్న సినిమాలో సైకోగా కనిపించ బోతున్నాడు. తన కెరియర్ లోనే ఇది బెస్ట్ రోల్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నవంబర్ నెల ప్రథమార్థంలో ఆడియో, ద్వితీయార్థంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
బుక్క సముద్రం శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజా, రేవ ప్రేమ జంటగా నటిస్తున్నారు. బిఎస్ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమారూపొందుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పోసాని సైకోయిజం ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. మామూలుగానే పోసాని నటన కొన్ని సినిమాల్లో సైకో మాదిరి ఉంటుంది. మరి అలాంటోడు సైకోగా మారాడంటే ఎంత భయంకరంగా ఉంటుందో?


Click it and Unblock the Notifications











