పోసాని..సాఫ్ట్ వేర్ ఉద్యోగి
'ఈ చిత్రంలో నేను సాఫ్ట్ వేర్ కంపెనీలో టీమ్ లీడర్ పాత్రలో కనిపిస్తాను. నా కేరెక్టర్‌లో వైవిధ్యమైన షేడ్స్ ఉంటాయి. ఎంతో ఎనర్జీ ఉన్న కేరెక్టర్ ఇది. తాను ఉద్యోగ బాధ్యతలలో నిమగ్నమై ఉన్న సమయంలో కథానాయిక ఆర్తి అగర్వాల్ తో పరిచయం ఏర్పడటం, ఆమెను పెళాడటం, ఆ తర్వాతి పరిణామాలు ఈ చిత్ర కథాంశం' అని దర్శక, రచయిత పోసాని కృష్ణ మురళి మీడియాకు చెప్పారు. పోసాని కృష్ణమురళి, ఆర్తి అగర్వాల్ జంటగా పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వీరభద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నల్లం పద్మజ నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై 22 నుంచి ప్రారంభమవుతుంది.
ఈ విషయాన్ని చిత్ర సమర్పకుడు నల్లం శ్రీనివాస్ తెలియజేస్తూ, 'ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంతో పూర్తవుతుంది. దసరాకి సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రంలో మరో ఇద్దరు కథానాయికలు కూడా ఉంటారు. మానవ సంబంధాలు, ఫ్యామిలీ డ్రామా, వినోదం ప్రధానాంశాలుగా ఉండే ఈ చిత్రంలో పోసాని కేరెక్టర్ వైవిధ్యంగా ఉంటుంది' అన్నారు. ఇక చిత్రానికి కెమెరా: ఆనంద్ సి.కుమార్, సంగీతం: అర్జున్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సమర్పణ: నల్లం శ్రీనివాస్, నిర్మాత: నల్లం పద్మజ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు పోసాని సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











