వాళ్ళు పిచ్చి కుక్కలు..పోసాని

By Staff

Posani Krishna Murali
మరో సారి మెంటల్ కృష్ణ విరుచుకుపడ్డారు. ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ వారితో మంటల్ కృష్ణ అనే టైటిల్ తో ఇచ్చిన ఇంటర్వూలో రకరకాల విషయాలపై తన అభిప్రాయాలను పోసాని కృష్ణ మురళి ఎప్పటిలాగే ఆవేశంతో వెళ్ళబుచ్చారు. దాసరి మేస్త్రి సినిమాపై మాట్లాడుతూ చిరంజీవిని విమర్శింస్తూ సినిమాలు తీసిన వాళ్ళు పిచ్చి కుక్కలని, ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా మండలాధీసుడు చిత్రం తీసారని, అయితే ఎన్టీఆర్ నెగ్గాక వారంతా రాష్ట్రం వదిలి పారిపోయారని, ఇప్పుడు కూడా అలాంటి పనులు చేసిన వారకికి అదే గతి పడుతుందన్నారు. ఇక రాజశేఖర్, జీవితల విమర్శలకు ఆధారాలున్నాయా అన్న దానికి వాళ్ళని ఛానెల్ కి తీసుకొచ్చి లైవ్ ఇప్పించండి జీవిత చరిత్రలు బయిటకు తీస్తాను.

రాజశేఖర్ ఎన్నిసార్లు పరిశ్రమలో వ్యక్తులతో గొడవ పడ్డారో ఏకరవు పెడతాను..ఆధారాలతో సహా అన్నారు. ఇక మా పరిశ్రమలోని వ్యక్తులపై కామెంట్ చేయవద్దని నిబంధన పెట్టింది అంటే..ఆ మురళిమోహన్ కదా పెట్టింది ఆ రూల్..ఆ నిబంధన పెట్టాక ఎంతమంది అలా కామెంట్స్ చేసారో నాకు తెలుసు..ముందు వాళ్ళను శిక్షించమనండి..అన్నారు. ఇక చిరంజీవి పార్టీలో ఎందుకు చేరారు..అంటే ఇండస్ట్రీలో గత ఇరవై ఏళ్ళుగా చిరంజీవిగారు నాకు తెలుసు.

ఎప్పుడూ ఏ నిర్మాతను ఆయన ఇబ్బంది పెట్టలేదు..ఏ ఆర్టిస్టుని సఫర్ చేయలేదు..ఏ దర్శకుడు కంప్లైంట్ ఇవ్వలేదని అందుకే క్లీన్ గా ఉన్న వ్యక్తి గాబట్టే నమ్మానని అన్నారు. ఇక కాంగ్రేస్ గజదొంగ అని తెలుగుదేశం పెద్ద దొంగ అని వీళ్ళిద్దరూ రాష్ట్రాన్ని పంచుకోచూస్తున్నారని విమర్శించారు. ఇక బయటకు వెళ్ళిన పరకాల ప్రభాకర్ పై కామెంట్ చేస్తూ..పరకాల గడ్డి తినే పశువు కన్నా హీనమని..నిన్నటి దాకా చిరంజీవిని దేముడు అని పొగిడిన ఆయన ఇలా మాట్లాడటం సంస్కారం కాదన్నారు. అంతేగాక పరకాల మంచి కుటుంబం నుంచి వచ్చారని ఆ చరిత్రనైనా నిలబెట్టుకోవాలి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X