twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను అలా చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఆయన మంచోడంటున్న పోసాని

    |

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇప్పటి వరకు చేసింది నా దృష్టిలో మిస్టేకే అని వ్యాఖ్యానించారు ప్రముఖ నటుడు, రచయిత. దర్శకుడు పోసాని కృష్ణ మురళి. జగన్ మద్దతుదారుడైన పోసాని... వైసీపీ ఏపీలో అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

    పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టబోతూ చంద్రబాబుకు సపోర్ట్ ఇవక్వడం అనేది తప్పు. ఆయన దృష్టిలో అది తప్పు కాకపోవచ్చని, నా దృష్టిలో అది తప్పే. ప్రజలు కూడా అలాగే భావించారేమో, అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయేమో? అని పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు.

    జగన్‌కు మళ్లీ ఓటెయ్యాలని అడగను, పవన్ మంచి వ్యక్తే కానీ.. : మీడియాతో పోసానిజగన్‌కు మళ్లీ ఓటెయ్యాలని అడగను, పవన్ మంచి వ్యక్తే కానీ.. : మీడియాతో పోసాని

    Posani Krishna Murali Comments On Janasena Failure

    మొదట చంద్రబాబుకు సపోర్ట్ ఇచ్చి ఆయన్ను పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ చేశారు... మళ్లీ అదే చంద్రబాబును ఈ ఎన్నికల్లో తిట్టారని పోసాని గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ మొదట చంద్రబాబు సీనియర్ కాబట్టి అవినీతి పనులు చేయరేమో అనుకున్నారు. కానీ సీనియారిటీకి, అవినీతికి సంబంధం లేదని పోసాని చెప్పుకొచ్చారు.

    జగన్మోహన్ రెడ్డి రౌడీ, ఫ్యాక్షనిస్టు.. ఇలాంటి వ్యక్తి గెలవకూడదను అని పవన్ కళ్యాన్ తిట్టాడు. కానీ ఆయన ప్రజలకు ఏం ద్రోహం చేశాడో చెప్పలేకపోయాడు. ఎందుకంటే చెప్పడానికి అక్కడ ఏమీ లేదు. పవన్ కళ్యణ్ తన డిక్షనరీ నుంచి తంతాను, తరిమికొడతాను అనే పదాన్ని తీసివేయాలని పోసాని సూచించారు.

    Posani Krishna Murali Comments On Janasena Failure

    పవన్ కళ్యాణ్ గుడ్ పర్సన్... సినిమా కుటుంబ సభ్యుడిగా, సీనియర్‌గా చెబుతున్నాను. నువ్వు అలాంటి పదాలు వాడటం వదిలేయ్. నీలో మంచి క్వాలిటీలు ఉన్నాయి కాబట్టే ఈ విషయం చెబుతున్నాను. లేకుంటే చచ్చినా చెప్పేవాడిని కాదన్నారు.

    మీకు అనవసరంగా నీతులు చెబితే మీ అభిమానులు ఊరుకుంటారా? అలాంటి ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదు. మీలో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ప్రజలకు సేవ చేసే గుణం ఉంది, ఈ పొరపాటు మళ్లీ రిపీట్ కాకుండా ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్‌కు థర్డ్ ఫోర్స్ అవుతారు. అందుకే ఈ విషయం చెబుతున్నాను, బెస్టాప్ లక్... అంటూ పోసాని ముగించారు.

    English summary
    Posani Krishna Murali Press Meet about YS Jagan victory. YS Jagan's YSR Congress Party (YSRCP), which swept to power in Andhra Pradesh with a landslide victory, has bagged 151 seats in 175-member Assembly. It also won 22 out of 25 Lok Sabha seats.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X