ఆర్టిస్టులు అడుక్కు తింటున్నారు: పోసాని కామెంట్స్ నిజమే!

By Bojja Kumar

హైదరాబాద్: ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, సినీ కార్మికులు...ఇలా 24 విభాగాలకు చెందిన వారంతా చేతి నిండా పనితో హాయింగా ఉండే వారు. కానీ ఇపుడు పరిశ్రమలో పరిస్థితి పూర్తిగా మారి పోయింది. ఒకప్పుడు ఏడాదికి దాదాపు 200లకు పైగా సినిమాలు తెరకెక్కేవి. ఇపుడు 50 సినిమాలు రావడమే గగనం అయిపోయింది.

దేశంలోని సినీ పరిశ్రమలో బాలీవుడ్ తర్వాతి స్థానంలో తెలుగు సినీ పరిశ్రమ ఉండేది. పరిస్థితి చూస్తుంటే మన పరిశ్రమ మరింత దిగజారీ పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడే పోసాని కృష్ణ మురళి పరిశ్రమ స్థితి గతులపై ఇటీవల జేమ్స్ బాండ్ ఆడియో వేడుకలో స్పందించారు.

 Posani Krishna Murali comments on Tollywood

250 సినిమాల స్థానంలో కేవలం 30 సినిమాలు మాత్రమే వస్తున్నాయి. హీరోలు సినిమాల సంఖ్య పెంచకపోతే దారుణం పరిస్థితులు చోటుచేసుకుంటాయని పోసాని మురళి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 11 సినిమాల వరకు చేసేవారని, హీరోగా వుండగానే ఆయన గౌరవంగా పక్కకు తప్పుకున్నారని, హీరోగానే మిగిలిపోయారని చెప్పారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు.

ఎక్కవు సినిమాల్లో నటించినంత మాత్రనా హీరో దమ్ము పోదనిని చెప్పిన ఆయన పెద్ద హీరోలు చాలామంది ఏడాదికి ఒక్క సినిమాతోనే సరిపెడుతున్నారు. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు రోడ్డునపడి అడుక్కుంటున్నారు అని ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ తరం హీరోలైనా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని, తెలుగు చిత్ర పరిశ్రమను బ్రతికించాలని కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X