twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా ఫ్యామిలీలో తేజుకే ఎక్కువగా.. చిరంజీవి నైజం అలాంటిది, లేచి వచ్చాడు.. పోసాని!

    |

    Recommended Video

    Posani Krishna Murali Compares Sai Dharam Tej And Chiranjeevi || Filmibeat Telugu

    మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ కెరీర్ జోరు ఇటీవల బాగా తగ్గింది. ఓ మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని తేజు భావిస్తున్నారు. అలాంటి తరుణంలో చిత్రలహరి చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువత నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో నివేద పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. చిత్రలహరి విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళి ఆసక్తికర విషయాల వెల్లడించారు.

    సాయిధరమ్ తేజ్ తండ్రిగా

    సాయిధరమ్ తేజ్ తండ్రిగా

    చిత్రలహరి చిత్రంలో అందరిని ఆకర్షించిన పాత్రల్లో పోసాని పాత్ర కూడా ఉంది. పోసాని ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ తండ్రిగా అటు హాస్యాన్ని, ఇటు సెంటిమెంట్‌ని సమపాళ్లలో పండించారు. దీనితో పోసాని పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. తనకు ఇటీవల మజిలీ, చిత్రలహరి లాంటి మంచి చిత్రాలు చేశాననే సంతృప్తి దక్కిందని పోసాని అన్నారు.

     మెగా ఫ్యామిలిలో

    మెగా ఫ్యామిలిలో

    తాజాగా ఓ టివి ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ గురించి ప్రశంసలు కురిపించారు. మెగా ఫ్యామిలిలో అందరికంటే ఎక్కువగా చిరంజీవి పోలికలు వచ్చింది సాయిధరమ్ తేజ్‌కే అని పోసాని అన్నారు. పోలికలే కాదు గుణం కూడా అలాగే వచ్చిందని తెలిపారు. తాను చిరంజీవి మేనల్లుడిననే గర్వం తేజకు ఏమాత్రం లేదని పోసాని ప్రశంసించారు. ఏ వయసు వారితో ఎలా ఉండాలో తేజు అలా ఉంటాడని తెలిపారు.

     కొండవీటి దొంగ షూటింగ్‌లో

    కొండవీటి దొంగ షూటింగ్‌లో

    గాస్టార్ కొండవీటి దొంగ చిత్రానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశా. ఆ సమయంలో నేనెవరో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ బాగా చదువుకున్నవాడినని మాత్రం చిరంజీవికి ఎవరిద్వారానో తెలిసింది. నన్ను చూడగానే సెట్స్ లో ఉన్న చిరంజీవి నాకోసం లేచి వచ్చారు. చదువుకున్నవారంటే ఆయనకు చాలా ఇష్టం. నా లాంటి వాళ్ళని కాకా పట్టాల్సిన అవసరం కూడా చిరంజీవికి లేదు. కానీ నేను బాగా చదువుకున్నానని తెలిసి తన పక్కన కూర్చేబెట్టుకున్నారు. ఎంఏ, ఎంఫిల్ చేశారట కదా, డాక్టరేట్ కూడా చేస్తున్నారట కదా అని అడిగారు.

    ఆయన పిలిస్తే

    ఆయన పిలిస్తే

    చిరంజీవి నా కోసం లేచి రావాల్సిన అవసరం లేదు. పిలిస్తే నేనే పరిగెత్తుకు వెళ్ళేవాడిని. కానీ నా పట్ల చిరంజీవి గారు చాలా మర్యాదగా వ్యవహరించారని పోసాని గుర్తు చేసుకున్నారు. అది చిరంజీవి నైజం అని పోసాని తెలిపారు. ఇప్పుడు అవే లక్షణాలు సాయిధరమ్ తేజ్‌కు వచ్చాయని పోసాని తెలిపారు.

    డైరెక్టర్‌ని ప్రశ్నించలేదు

    డైరెక్టర్‌ని ప్రశ్నించలేదు

    ఇక చిత్రలహరిలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. నేను డైలాగ్ చెబితే అరచినట్లు ఉంటుంది. కానీ కిషోర్ తిరుమల ఈ చిత్రంలో అలా చెప్పకూడదు అని చెప్పాడు. మీ వాయిస్ కాస్త తగ్గించి డైలాగ్ చెప్పాలని కోరాడు. దీనితో రెండు మూడు టేకులు అయినా నేను దర్శకుడుని ప్రశ్నించలేదని అందువల్లే తన పాత్ర చాలా బాగా వచ్చిందని పోసాని తెలిపారు.

    English summary
    Posani Krishna Murali compares Sai dharam Tej and Chiranjeevi. Posani Plays Tej's father role in Chitralahari. Chitralahari movie released on 12th April. Kishore Tirumala is the director. Kalyani Priyadarshan, Nivetha Pethuraj are playing female leads
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X