twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ ఎంత నీతిగా వచ్చినా బండి నడవదు: పోసాని సంచలన కామెంట్!

    |

    Recommended Video

    Posani Krishna Murali Controversial Comments On Jr NTR || Filmibeat Telugu

    ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి ఇటీవల సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. గజ్జల్లో సమస్యతో బాధ పడుతున్న పోసాని... ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య కారణంగానే ఆయన గతంలో ఎన్నికల సంఘం నోటీసులు పంపినా విజయవాడ వెళ్లలేకపోయారు. ఆ సమయంలోనే మీడియా ముఖంగా తన సమస్య గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే.

    ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ను ఓ ప్రముఖ టీవీ ఛానల్ వారు కదిలించారు. తన ఆరోగ్యం గురించి పోసాని వివరిస్తూ... ''ఇపుడు ఆరోగ్యం కాస్త బెటర్ అయింది. కానీ ఇంకా తగ్గలేదు. ఇన్‌ఫెక్షన్ అలాగే ఉంది. డాక్టర్ గారు ప్రతి మంగళవారం మూడు వారాలు వచ్చి స్కానింగ్ చేయించుకోమన్నారు. 90 శాతం మందులతో తగ్గిపోతుంది, తగ్గనపుడు చూద్దాం అన్నారు.' అని తెలిపారు.

    నా కోరిక తీరింది, అదే పెద్ద ఆనందం

    నా కోరిక తీరింది, అదే పెద్ద ఆనందం

    ఎప్పుడూ యాక్టివ్‌గా తిరుగుతూ ఉంటాను. అలాంటిది బెడ్ మీద రెండు నెలలు ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. జగన్ సీఎం కావాలనే నా కోరిక తీరింది. ఆయన ఇలాగే ఉండి, ఇలాగే ప్రజాసేవ చేస్తూ... ఇలాగే ప్రజలను ప్రేమిస్తే... 2024 తర్వాత కూడా ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాడని పోసాని చెప్పుకొచ్చారు.

    ఏ ఎన్టీఆర్ వచ్చినా ఇపుడు కష్టమే

    ఏ ఎన్టీఆర్ వచ్చినా ఇపుడు కష్టమే

    జూ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఓ వర్గం భావిస్తోంది. దీనిపై మీరేమంటారు? అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ... ‘‘మళ్లీ ఆ సీనియర్ ఎన్టీఆర్ వచ్చినా, జూ ఎన్టీఆర్ వచ్చినా ఇక్కడంటూ ఒక ప్లేస్ అంటూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించడం లేదు, ఆయన అవినీతికి పాల్పడుతున్నాడు, ప్రజా సేవ చేయడం లేదు అనే పరిస్థితి ఉంటే ఆ ప్లేస్ దొరుకుతుంది. కానీ జగన్ అలాంటి అవకాశం ఇవ్వడు, ఆయన అలా చేసిన రోజు మీకు నాకు చెప్పండి... మీ ముందే గుంజీలు తీస్తా'' అని పోసాని వ్యాఖ్యానించారు.

    జూ ఎన్టీఆర్ వచ్చినా బండి నడవదు

    జూ ఎన్టీఆర్ వచ్చినా బండి నడవదు

    జూ ఎన్టీఆర్ ఎంత నీతిగా, చిత్తశుద్దిగా ఇపుడు రాజకీయాల్లోకి వచ్చినా బండి నడవదు. ఒక హీరో వచ్చి ఆకాశం నుంచి చుక్కలు తీసుకొస్తానంటే నమ్మే రోజులు లేవు. బి ప్రాక్టికల్... హీరో అయితే ఇమేజ్ పెరుగుతుంది, తెలివి తేటలు పెరగవు. ప్రజసేవా దృక్ఫథం పెరగదు. హీరో ఇమేజ్‌కు ... రాజకీయాలకు సంబంధం లేదని... పోసాని చెప్పుకొచ్చారు.

    చూడటానికి వచ్చేవారంతా ఓటర్లుగా మారరు

    చూడటానికి వచ్చేవారంతా ఓటర్లుగా మారరు

    ఇమేజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నేను వెళితే చూడటానికి వంద మంది వస్తే... హీరోలను చూడటానికి పదివేల మంది వస్తారు. అయితే ఈ పదివేల మంది ఓటర్లుగా మారరు. హీరోను తెరపై చూశాం, రియల్‌గా ఎలా ఉంటాడో చూడటానికి మాత్రమే వస్తారు. ఇతడు మన కోసం ఏం చేయగలడు? అనేంత డెప్తుగా జనం ఆలోచించరని... పోసాని అభిప్రాయపడ్డారు.

    సేవ చేయడానికా? హీరో ఇమేజ్‌తో గెలిచి సీఎం సీట్లో కూర్చోవడానికా?

    సేవ చేయడానికా? హీరో ఇమేజ్‌తో గెలిచి సీఎం సీట్లో కూర్చోవడానికా?

    ఇతడు మనకు సేవ చేయడానికి వచ్చాడా? హీరో ఇమేజ్‌తో గెలిచి సీఎం సీట్లో కూర్చోవడానికి వచ్చాడా? అనేది నాకంటే బాగా ప్రజలు కనిపెట్టేశారు. ఏ రామారావును నమ్మి ముఖ్యమంత్రిని చేశారో... ఇదే రామారావును జనం తీసి పక్కన పెట్టి ఓడించారని... ఈ సందర్భంగా పోసాని గుర్తు చేసుకున్నారు.

    నాకు ప్రజలు, సమాజం ముఖ్యం

    నాకు ప్రజలు, సమాజం ముఖ్యం

    నాకు ప్రజలు, ఈ సమాజం ముఖ్యం... వారిని ఎవరు బాగా ఉద్దరిస్తారో, సేవ చేస్తారో వారిని ఇష్టపడతాను. ఈ విషయంలో ప్రథమ స్థానంలో జగన్ ఉన్నాడు. అందుకే జగన్‌ను ఇష్టపడుతున్నాను. ఆయనకు మద్దతు ఇవ్వడానికి కారణం అదే అని పోసాని తెలిపారు.

    English summary
    Posani Krishna Murali controversial comments on Jr NTR. "If Jr NTR comes, there will be no benefit to Telugu Desam Party" posani said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X