twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవార్డులను ఆపేస్తావా? నీ అబ్బ సొత్తా.. లోకేష్‌పై నిప్పులు చెరిగిన పోసాని

    ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల ప్రకటన వివాదాస్పదమైన నేపథ్యంలో మంత్రి లోకేష్‌బాబు స్పందించిన తీరుపై సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు.

    By Rajababu
    |

    Recommended Video

    అవార్డులను ఆపేస్తావా? నీ అబ్బ సొత్తా.. లోకేష్‌పై పోసాని ఫైర్

    ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల ప్రకటన వివాదాస్పదమైన నేపథ్యంలో మంత్రి లోకేష్‌బాబు స్పందించిన తీరుపై సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. మంత్రి లోకేశ్ బాబు చెప్పిన ప్రకారం నంది అవార్డులపై విమర్శలు చేస్తున్న వారంతా నాన్ రెసిడెంట్ ఆంధ్ర (ఎన్ఆర్‌ఏ)లే. వారికి ఆంధ్రలో ఆధార్ కార్డులు లేవు. అలాంటి వారే నంది అవార్డులపై విమర్శలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలను పోసాని తప్పుపట్టారు.

     లోకేష్ మాటలను బట్టి చూస్తే

    లోకేష్ మాటలను బట్టి చూస్తే

    తెలుగు ప్రజలు, ప్రభుత్వం చాలా మంచివారని. ఎన్నడూ ఆంధ్రప్రాంతవాసులను ఎన్నడూ చిన్నచూపు చూడలేదు. మంత్రి లోకేష్ బాబు మాటలను బట్టి చూస్తే విభజన తర్వాత అటు ఆంధ్రాకు ఇటు తెలంగాణాకు కాకుండా తెలుగు రోహింగ్యాలం అయ్యాం.

     హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని..

    హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని..

    మంత్రి లోకేశ్ బాబు స్పృహతోనే మాట్లాడుతున్నావా లేక తాగి మాట్లాడుతున్నావా? నీవు అసలు చదువుకున్నావా? బుద్ది, జ్క్షానం ఉండే మాట్లాడుతున్నా? ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండి మాట్లాడకూడదా? విభజన చట్టం ప్రకారం 2014 నుంచి 2024 వరకు ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని లోకేశ్ మరిచిపోయాడా అని పోసాని ప్రశ్నించారు.

     హైదరాబాద్‌లో ఆస్తులు నీకు లేవా?

    హైదరాబాద్‌లో ఆస్తులు నీకు లేవా?

    ఉమ్మడి రాజధానిలో అధికారికంగా జీవించే హక్కు మాకు లేదా? తెలంగాణలో ఉంటూ ఆంధ్ర ప్రాంతంలో రాజకీయం చేయవచ్చా? మీ కుటుంబ సభ్యులకు ఇక్కడ ఆస్తిపాస్తులు లేవా? తెలంగాణలో పన్ను కడుతూ ఆంధ్రాలో రాజకీయం చేయడం లేదా అని పోసాని ప్రశ్నల వర్షం కురిపించాడు.

     వారు జ్యూరీగా ఎందుకు?

    వారు జ్యూరీగా ఎందుకు?

    తెలంగాణలో ఆధార్ కార్డు ఉన్న వ్యక్తులను జ్యూరీ సభ్యులుగా ఎందుకు పెట్టుకొన్నావు. నంది పురస్కారాలపై రాద్దాంతం చేస్తే అవార్డులను ఎత్తేస్తాం అని లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మ అవార్డులపై విమర్శలు వచ్చినప్పుడు అవార్డులను ఎత్తివేస్తామని ఏనాడూ చెప్పలేదే అని పోసాని నిలదీశాడు.

     ప్రశ్నించడం తప్పా

    ప్రశ్నించడం తప్పా

    రాజకీయాల్లో ఓ విధానం, సినిమా రంగానికి ఓ విధానం పాటించే మీలాంటి రాజకీయ నేతల మాటలను మా ఖర్మకాలి వినాల్సి రావడం చాలా దురదృష్టకరం. ప్రతిభావంతులకిచ్చే అవార్డుల్లో లోపాలు జరిగాయని ప్రశ్నించడం తప్పా?

     లైడిటెక్టర్ పరీక్షలు పెట్టు

    లైడిటెక్టర్ పరీక్షలు పెట్టు

    ప్రముఖ టీవీ ఛానెల్ల ముందు జ్యూరీ సభ్యులకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించండి. లోపాలు జరుగలేదని, ప్రతిభావంతులకు అన్యాయం జరుగలేదని తేలితే అందరి కాళ్లు పట్టుకొని పాదాభిషేకం చేస్తాను అని పోసాని అన్నారు.

     కమ్మవాడిగా సిగ్గుపడుతున్నాను

    కమ్మవాడిగా సిగ్గుపడుతున్నాను

    నాకు నంది అవార్డు వచ్చినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. నేను కమ్మ సామాజిక వర్గానికి చెందినందునే నాకు అవార్డు ఇచ్చారనే విమర్శ రావడానికి ఆస్కారం ఉంది. లోపాలు జరిగాయని చంద్రబాబు మాటల వల్ల అర్థమవుతున్నది.

     లోకేష్.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో

    లోకేష్.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో

    రాజకీయాల్లో ఎమ్మెల్యే ఎన్నిక అక్రమంగా జరిగిందనే విషయంపై సదరు రాజకీయ ప్రతినిధిని వెనుకకు తీసుకొంటారు. సినీ రంగంలో అవార్డుల ఎంపికలో లోపాలు జరిగాయని ప్రశ్నిస్తే పురస్కారాలు ఎత్తివేస్తామని లోకేష్ చెప్పడం ఆయన రాజకీయ పరిణితికి అద్దం పడుతున్నది. రాజకీయ నేతలు ఎలా మాట్లాడాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలని లోకేష్‌కు సూచించాడు.

     నంది అవార్డు తీసుకోను..

    నంది అవార్డు తీసుకోను..

    టెంపర్ చిత్రానికి నంది అవార్డు వచ్చిందని తెలిసి చాలా సంతోషపడ్డాను. సాయంత్రం టీవీ పెట్టి చూస్తే కమ్మ వాళ్లే అవార్డులు పంచుకొన్నారు. వాళ్లకే అవార్లులు వచ్చాయని విమర్శలు రావడంతో మనస్తాపం చెందాను. అందుకే నాకు వచ్చిన నంది అవార్డును తీసుకోవడం లేదు.

     నంది అవార్డును తిరస్కరిస్తున్నా..

    నంది అవార్డును తిరస్కరిస్తున్నా..

    కమ్మ వాడు కావడం వల్లే అవార్డు వచ్చిందనే అపవాదును నేను మోయలేను. అందుకే ఈ నంది అవార్డు నాకు వద్దు. నాకు వచ్చిన నందిని వినమ్రంగా తిరస్కరిస్తున్నా. ఇలాంటి నీచమైన పద్ధతిలో అవార్డు తీసుకోలేను. ఈ వివాదాస్పదమైన అవార్డులను రద్దు చేసి మళ్లీ న్యాయంగా ప్రకటిస్తే సంతోషిస్తాను.

     ప్రశ్నిస్తే ఎన్ఆర్ఏనా?

    ప్రశ్నిస్తే ఎన్ఆర్ఏనా?

    నంది అవార్డులను ప్రశ్నిస్తే మమల్ని నాన్ లోకల్ అని అంటావా? నీవు హైదరాబాద్‌‌లో ఓటు వేయలేదా? పన్ను కట్ట లేదా.. అవార్డులు రద్దు చేస్తాను అనడానికి అవేమన్న నీ అబ్బ సొత్తా?. నీవు లోకేశ్ అవార్డు అని పెట్టుకో.. కమ్మ కులం వారికే ఇచ్చుకో.. ఎవరికీ అభ్యంతరం ఉండదు.

    English summary
    Film personality Posani Krishna Murali fires on AP Minister Lokesh Babu. He asked many questions to Lokesh over Nandi Awards contravercy. Posani faults Lokesh statement which he threaten to cancel Nandi awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X