తెలంగాణపై తెగ స్పీచ్ ఇస్తున్న ‘మెంటలోడు’
మొరిగే కుక్క కరువదు-కరిచే కుక్క మొరగదు. అని చెబుతుంటారు. చాలామంది. ఆరకంగా చూస్తే రచయిత, నిర్మాత, ప్రస్తుతం హీరో అయిన పోసాని కృష్ణమురళి పుల్ గా అరుస్తాడు. మొరుగుతాడు, అవసరమైతే కరుస్తానని కూడా చొక్కాని వెనక్కి లాక్కుంటాడు. ఇటీవల తెలంగాణ అంశం పై రాష్ట్రం అట్టుడికి పోతుంటే ధైర్యంగా ముందుకొచ్చి తన వాణి వినిపించాడు. ఆయన 'ఐ" న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ తెలంగాణ రానివ్వండి ! అయితే నష్టమేంటి!
వస్తే ఇక్కడున్న ఆంధ్రవాడిని ఇంకో రూపాయి ఎక్కువ కట్టమని అడుగరు. అలాగని తెలంగాణ వాడికి రూపాయి తగ్గించరు, ఏ రాష్ట్రం వచ్చినా మనిషి తన తెలివి తేటల మీదే బతకాల్సి వుంటుంది. ఈ కారణంగా ప్రజలు కన్ ఫ్యూజన్ కి గురికావల్సిన అవసరం లేదు..ఇదో పనికి మాలిన అంశం ఇంకా నిర్మాణాత్మక అంశాలు రాష్ట్రంలో ఇంకెన్నో ఉన్నాయి అంటూ తన చొక్కాని వెనక్కి లాక్కున్నాడు పోసాని.
నీకేం తెలుసు ఏ హీరోయిన్ అయితే కాస్త దీవాలా పడిందో అటువంటి వారిని తీసుకొచ్చి నీ సినిమాలో పెట్టుకుని నాలుగు బూతులు మాట్లాడితే ...ఆ పిచ్చి జనం ఎగబడి చూస్తున్నారు కదా!. అనుకుంటే సరిపోతుందా!.కన్నతల్లి విలువ నీకేం తెలుసు అంటూ సమైక్యాంద్రా ప్రజలు తీవ్రంగా పోసానిని దుమ్మెత్తి దూషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











