వివాహం విద్య నాశనం... శోభనం సర్వనాశనం: తన పెళ్లి గురించి పోసాని కామెంట్!

Recommended Video

Posani Krishna Murali Funny Comment On His Marriage || Filmibeat Telugu

ప్రముఖ తెలుగు నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని పెళ్లి కారణంగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి వెల్లడించారు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లి కారణంగా భార్యభర్తలుగా తాము ఏం కోల్పోయామో వెల్లడించే ప్రయత్నం చేశారు.

'నా భార్య పేరు కుసుమలత, తను బిఎస్సీ బిఎల్... ఎంఎల్ నాగ్ పూర్ యూనివర్శిటీ. తను ఎంఎల్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుండగా మా పెళ్లి అయింది. నేను ఎంఏ, ఎంఫిల్ చేశాను. పిహెచ్‌డి 3 సంవత్సరాలైంది. మూడు నెలల్లో వైవా చేస్తే డాక్టరేట్ వచ్చేది. ఆ సమయంలోనే మా పెద్దలు పెళ్లి కుదిర్చారని తెలిపారు.

వివాహం విద్య నాశనం.. శోభనం సర్వనాశనం

వివాహం విద్య నాశనం.. శోభనం సర్వనాశనం

‘‘రెండు మూడు నెలలు ఆగితే నా పిహెచ్‌డి అయిపోయి నేను డాక్టరేట్ పొందేవాడిని, మా ఆవిడ ఎంఎల్ కూడా పూర్తయ్యేది. కానీ పెద్దలు అప్పుడే పెళ్లి చేశారు. వారి మాట కాదనలేక పోయాం. పెళ్లయితే అంతే... వివాహం విద్య నాశనం.. శోభనం సర్వనాశనం.'' అని వ్యాఖ్యానించారు.

మా మధ్య అనుబంధం

మా మధ్య అనుబంధం

కానీ దానికి మించిన సాన్నిహిత్యం, ఆప్యాయతలు, ఎఫెక్షన్, లవ్ అవన్నీ.. నాకు, నా భార్య మధ్య కాస్త ఎక్కువగా ఏర్పడ్డాయి. మేమిద్దరం మొగుడు పెళ్లాల మాదిరిగా ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. ముందు నుంచీ ఫ్రెండ్స్ లాగే ట్రావెల్ అవుతూ వచ్చామని పోసాని గుర్తు చేసుకున్నారు.

ఒక్కోసారి నేను కొడుకు, ఆమె తల్లి

ఒక్కోసారి నేను కొడుకు, ఆమె తల్లి

పెళ్లయినప్పటి నుంచి ఆమె నా పెళ్లాం.. నేను మొగుడు అనుకోలేదు. ఓసారి నేను పెళ్లాం పాత్ర... ఓసారి ఆమె మొగుడు పాత్ర... మరోసాని ఫ్రెండు పాత్రల్లో ఉంటాం. కొన్ని సార్లు నేను కొడుకు పాత్రలో.. నా భార్య అమ్మపాత్రలో ఉంటుంది... అంటూ తమ మధ్య అనుబంధం గురించి పోసాని వివరించారు.

ఇంటి పెత్తనం అంతా ఆవిడదే

ఇంటి పెత్తనం అంతా ఆవిడదే


‘‘ఇంట్లో ఎవరి డామినేషన్ ఎవరి మీద ఉండదు. ఇంటి పెత్తనం అంతా కూడా నా భార్యదే. డబ్బులకు సంబంధించిన విషయాలైనా, మరే ఇతర విషయమైనా నేను ఆమెకు తెలియజేస్తాను.'' అని పోసాని కృష్ణ ముకళి వెల్లడించారు.

కుమారుడి గురించి అంతకు ముందు ఓ వేడుకలో

కుమారుడి గురించి అంతకు ముందు ఓ వేడుకలో

కొన్ని రోజుల క్రితం జరిగిన ‘ముఖ్యమంత్రిగారు మీరు మాటిచ్చారు' అనే సినిమా వేడుకలో పోసాని తన కుమారుడి గురించి మాట్లాడుతూ... 'ఈ చిత్రానికి కథ, మాటలు నేను రాయలేదు. నా కొడుకు రాశాడు. వాడి పేరు పోసాని ఉజ్వల్. నాకంటే ఫాస్ట్. తెలివిగలవాడు. ఇపుడు హంగేరీలో ఉంటూ మీడియా సైన్స్ అనే కోర్స్ చేస్తున్నాడు. నన్ను నా కొడుకు ఒరేయ్ అంటాడు... కథ, మాటలు రాసి ఒరేయ్ ఇది తీయ్ చాలా బావుంటుంది, కొత్తగా ఉంటుంది అని చెప్పాడు' అని గుర్తు చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X