సగం వీడి మీద, సగం నా పెళ్లాం మీద నమ్మకం: పోసాని స్పీచ్‌తో మహేష్ బాబు నవ్వులే నవ్వులు!

By Bojja Kumar

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి నిర్మించిన చిత్రం 'భరత్‌ అనే నేను' బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలోహైదరాబాద్‌ నోవాటెల్‌లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా పోసాని కృష్ణ మురళి తన ఫన్నీ స్పచ్ తో ఆకట్టుకున్నారు. తన మేనల్లుడు శివ గురించి పోసాని కొన్ని సంఘటనలు గుర్తు చేస్తుంటే మహేష్ బాబు పగలబడి నవ్వారు.

సగం వీడిమీద నమ్మకం, సగం నా పెళ్లాం మీద నమ్మకం

సగం వీడిమీద నమ్మకం, సగం నా పెళ్లాం మీద నమ్మకం

‘కొరటాల శివ.. నా మేనల్లుడు. వీడికి స్పెషల్ టేస్ట్ ఒకటి ఉంది. నా పెళ్లి చూపులకు వీన్నే తీసుకెళ్లాను. చూసి నేను బయటకు వచ్చాను. ఎలా ఉందిరా అని అడిగాను. మామ అమ్మాయి బలే ఉంది చేసుకో అన్నాడు. ఒట్టు ఆ అమ్మాయినే చేసుకున్నాను. సగం వీడిమీద నమ్మకం, సగం నా పెళ్లాం మీద నమ్మకం.' అని పోసాని తనదైన శైలిలో ఫన్నీగా చెప్పడంతో మహేష్ బాబు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు.

శివ కథలు చాలా మంది కాజేశారు

శివ కథలు చాలా మంది కాజేశారు

‘శివను చిన్నప్పటి నుండి ఎత్తుకుని తిరిగాను. అప్పటి నుండి మాటలు చాలా తక్కువగా ఉంటాయి మహేష్ బాబు మాదిరిగా.... చేతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చాక కొరటాల శివ చాలా సంపాదించాడు అని మీరు అనుకుంటారు. కానీ ఎక్కువ పోగొట్టుకున్నాడు. వాడి కథలను చాలా మంది కాజేశారు. లేక పోతే పది సినిమాలు సూపర్ హిట్ కొట్టేవాడు.' అని పోసాని చెప్పుకొచ్చారు.

శివకు, నాకు తేడా అదే...

శివకు, నాకు తేడా అదే...

నాకు, కొరటాల శివకు డైలాగులు రాసే విషయంలో ఓ తేడా ఉంది. రాజకీయ నాయకుల గురించి, వాళ్లు చేసే అవినీతి గురించి నేను రాస్తే... ‘ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఎ న్యూ లాంగ్వేజ్ టు ఎక్యూజ్ పీపుల్ లైక్ మి. మీ లాంటి వారిని తిట్టాలంటే కొత్త బాష కనిపెట్టాలిరా' అని రాసేవాడిని, కానీ శివ ‘మిమ్మల్ని మగాళ్లుగా తయారు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను' అని రాస్తారు. శివది పాజిటివ్ నేచర్. నాది ప్రాక్టికల్ నేచర్. అదే మా ఇద్దరికీ తేడా.... అని పోసాని తెలిపారు.

మహేష్ బాబు గురించి పోసాని

మహేష్ బాబు గురించి పోసాని

మహేష్ బాబు గురించి చెప్పడానికి కొత్తగా ఏమీ లేదు. నా భయం ఏమిటంటే మహేష్ బాబు అలాగే ఉన్నాడు, మేమంతా ముసలి వాళ్లం అయిపోతున్నాం. మా అబ్బాయి మూడేళ్ల వయసు నుండే మహేష్ బాబు ఫ్యాన్. వాడు కూడా మహేష్ బాబు కంటే పెద్దోడిలా కనిపిస్తున్నాడు నా కళ్లకు. ఆయన ఇలాగే ఉండాలి. సూపర్ స్టార్ కృష్ణ నా ఫేవరెట్ హీరో. ఆయన ఎంత అందంగా ఉంటారో....ఆయన మనసు అంత అందంగా ఉంటుంది. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటారో అంతకంటే ఆయన మనసు చాలా చాలా అందంగా ఉంటుంది.... అని పోసాని అన్నారు.

నా కొడుకు ఈ సినిమాతోనే కెరీర్ మొదలు పెట్టాడు

ఈ సినిమా ఆదరించిన ప్రేక్షకులకు చాలా చాలా థాంక్స్. ఈ సినిమా విడుదల విషయంలో నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నా కొడుకు ఈ సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. వాడు లాస్ ఏంజిల్స్ లో సంవత్సరంన్నర ట్రైనింగ్ చేసి వచ్చాడు. వాడి పేరు ప్రజ్వల్... అని పోసాని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X