For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరు, పవన్ కలిసి ఆఫరిచ్చారు.. జగన్ మనుషులను పంపాడు: పోసాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  By Manoj Kumar P
  |

  పోసాని కృష్ణ మురళి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరిది. రచయితగా సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన.. డైరెక్టర్‌గా, యాక్టర్‌గా మారిపోయి చాలా కాలంగా తన మార్క్‌ను చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఆయన.. అత్యుత్తమ నటనను కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ ఆఫర్లను సైతం దక్కించుకుంటున్నారు. సినిమాలే కాదు.. రాజకీయాల్లోనూ పోసాని రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో పాటు ఏపీ సీఎం జగన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

  అన్నింటిలోనూ ఉండే ఆల్‌రౌండర్

  అన్నింటిలోనూ ఉండే ఆల్‌రౌండర్

  పోసాని కృష్ణ మురళి సినిమాల్లో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన రాజకీయాల్లోనూ తనదైన మార్క్‌ను చూపించారు. అలాగే, బుల్లితెరపైనా ఆయన సత్తా చాటుతున్నారు. గతంలో కొన్ని సీరియల్స్‌లో నటించిన ఆయన.. పలు కార్యక్రమాల్లోనూ పాలు పంచుకున్నారు. అలాగే, కొన్నింటికి జడ్జ్‌గా వ్యవహరించారు.

  పోసాని ఆరోగ్యంపై పుకార్లు.. క్లారిటీ

  పోసాని ఆరోగ్యంపై పుకార్లు.. క్లారిటీ

  ఆ మధ్య పోసాని ఆరోగ్యంపై కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం క్షిణించిందని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రచారం జరిగింది. దీంతో పోసాని అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన దీనిపై స్పందించారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారాయన.

  సినిమాలు తగ్గించి.. అక్కడికి చేరారు

  సినిమాలు తగ్గించి.. అక్కడికి చేరారు

  పోసానికి కొద్ది రోజుల క్రితం మోకాళ్లకు సంబంధించిన సర్జరీ జరిగిందన్న విషయం తెలిసిందే. అది అయినప్పటి నుంచి ఈ సీనియర్ ఆర్టిస్టు సినిమాలను తగ్గించేశారు. గతంలో ఒప్పుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగులలో మాత్రమే పాల్గొంటున్న ఆయన.. జబర్ధస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఓ స్కిట్ చేయడంతో పాటు జడ్జ్‌గానూ వ్యవహరించారు.

  చిరంజీవి, పవన్ కలిసి ఆఫరిచ్చారు

  చిరంజీవి, పవన్ కలిసి ఆఫరిచ్చారు

  తాజాగా పోసాని కృష్ణ మురళి ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయాలని చిరు, పవన్ డిసైడ్ అయ్యారు. నాకు తెలియకుండానే బీ పారమ్ పంపారు. దీంతో నామినేషన్ వేసి పోటీ చేశాను. కానీ, ఒక్క రూపాయి కూడా పంచలేదు' అని చెప్పుకొచ్చారు.

  #PosaniKrishnaMuraliPressmeet: Posani Krishna Murali Counter To Comedian Pruthvi | Fillmibeat Telugu
   మా ఇంటికి జగన్ మనుషులను పంపాడు

  మా ఇంటికి జగన్ మనుషులను పంపాడు

  ఇదే ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్‌తో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడారు. ‘వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ నాకు మూడు ఆఫర్లు ఇచ్చారు. అందుకోసం ఇప్పటికి రెండు సార్లు మా ఇంటికి మనుషులను పంపించారు. కానీ, నేను మాత్రం ఏ పదవి వద్దని చెప్పాను. అయితే, నన్ను గుర్తుంచుకోవాలని మాత్రం ఆయనను కోరాను' అని పోసాని వెల్లడించారు.

  English summary
  Posani Krishna Murali is an Indian screenwriter, actor, director and producer who primarily works in Telugu cinema. He worked as a writer for over 150 Telugu films and directed a number of films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X