Posani Missing: దాడి తర్వాత టెన్షన్ లో ఆ నిర్మాతలు.. చిరంజీవి స్పందించరా అంటూ ఫోన్.. అసలేమైంది?

ఏపీ ప్రభుత్వం మీద రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఘాటుగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తన భార్యను టార్గెట్ చేసి మాట్లాడారు అని చెబుతూ పవన్ పై పోసాని రెండో రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ దారుణ కామెంట్స్ చేశారు.

ఇక ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ కొంత మంది పోసానిపై హైదరాబాద్‌లో ప్రెస్‌క్లబ్‌లో దాడికి యత్నించారు. అయితే ఇప్పుడు ఈ టెన్షన్ లో ఉన్న పోసాని సినీ నిర్మాతలను టెన్షన్ పెడుతున్నారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఇంటి మీద రాళ్ల దాడి

ఇంటి మీద రాళ్ల దాడి

హైదరాబాద్‌ ఎల్లారెడ్డి గూడలోని పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరిగిందని అంటున్నారు. పోసాని ఇంటిపై ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడి చేశారని అమీర్పేట్ సమీపంలోని ఎల్లారెడ్డి గూడలోని పోసాని ఇంటిపై పై రాత్రి 2 గంటల ప్రాంతంలో దుండగులు రాళ్లు విసిరినట్టు చెబుతున్నారు. పోసానిని బండ బూతులు తిడుతూ దుండగులు రెచ్చిపోయిన క్రమంలో భయాందోళనకు గురైన వాచ్ మెన్ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

ఇటుకలు విసిరి

ఇటుకలు విసిరి

నిజానికి ఎనిమిది నెలలుగా వేరే చోట పోసాని కుటుంబం కాపురం ఉంటోంది. అయితే ఇంటి బయట వాచ్ మెన్ కుటుంబం ఉండగా దాడి జరగడంతో సంజీవ రెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది వాచ్ మెన్ కుటుంబం. ఈ సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సి సి ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.

గత మూడు రోజులుగా పవన్, కళ్యాణ్ పోసానిల మధ్య మాటల యుద్ధం. ఈ నేపథ్యంలో పోసాని ఇంటిపై దాడి జరగడం చర్చనీయాంశం అయింది. పోసాని ఇంట్లోనే ఉన్నాడు అనుకున్న దుండగులు బూతులు తిడుతూ రాళ్లు..ఇటుకలు విసిరారు అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

వాళ్ళే చేశారు

వాళ్ళే చేశారు

ఇక తన ఇంటి పై దుండగులు రాళ్ల దాడి జరగడం మీద నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. ఆ పని చేసింది పవన్‌ కల్యాణ్ అభిమానులేనని ఆరోపించిన ఆయన ఇలాంటి దాడులకు తాను భయపడబోమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నిస్తే ఇళ్లపై దాడి చేస్తారా? అని పోసాని ప్రశ్నించారు.

పవన్‌ కల్యాణ్‌ లాంటి ఆవేశపరులు రాజకీయాలకు పనికిరారని అభిప్రాయపడ్డ పోసాని పవన్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తుంటారని, ఆ తీరుపై ప్రశ్నించినంత మాత్రాన దాడి చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

చిరంజీవి ఏం చేస్తున్నారు

చిరంజీవి ఏం చేస్తున్నారు

పవన్ కల్యాణ్ డబ్బులు ఇచ్చి మరీ రాళ్లదాడి చేయిస్తున్నారన్న పోసాని కృష్ణమురళి రాజకీయాలతో సంబంధం లేకున్నా తన భార్యను తిడుతున్నారని, ఇంత జరుగుతున్నా చిరంజీవి స్పందించకపోవడం బాధగా ఉందని అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు టీడీపీ నాయకులు విమర్శలు చేస్తే తాను అడ్డుగా నిలబడి పోరాడానని చిరంజీవిని సోదరుడిలా భావించి, ఆయన కుటుంబానికి రక్షణగా నిలిచానని, ఇప్పుడు ఆయన సోదరుడే తనపై దాడులు చేయిస్తుంటే చిరంజీవి మాట్లాడలేకపోతున్నారని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

Heroine Shwetta Parashar About 'Alanti Sitralu' Movie
పోసాని మిస్సింగ్

పోసాని మిస్సింగ్

ఇక మరో పక్క టాలివుడ్‌ను పోసాని కృష్ణమురళి వైఖరి బేజారెత్తిస్తున్నారని అంటున్నారు. ఆందోళనలో పోసానితో సినిమాలు చేస్తున్న నిర్మాతలు ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నారు అనే సమాచారం కూడా నిర్మాతలకు లేదని అంటున్నారు. పోసాని కోసం నిర్మాతల గాలిస్తున్నారని, నిర్మాతలకు సైతం అందుబాటులో లేకుండా పోసాని అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు.

ఆయన కాంబినేషన్ షూటింగ్‌లకు అంతరాయం కలుగుతోందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో పక్క కొన్ని చానెళ్ళకి ఫోన్ ఇన్ లు ఇస్తూ ఉండడంతో ఈ వివాదం సమసిపోయే దాకా ఆయన బయటకు రాకుండా ఉండాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X