పోసాని చేపల చెరువు

By Staff

Posani Krishna Murali
మొన్న మెంటల్ కృష్ణతో పలకరించిన పోసాని మళ్ళీ 'రాజావారి చేపల చెరువు' పేరుతో ఓ రాజకీయ వ్యంగ్య చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.ఈ చిత్రం గురించి పోసాని మాట్లాడుతూ ''సాధారణంగా చెరువులో ఒక రకం చేపల్నే పెంచుతారు. కానీ రాజావారి చెరువులో అన్ని రకాలూ ఉంటాయి. రాజా వారెవరు? ఆ చేపల కథేమిటి? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. రాజకీయాల చుట్టూ తిరిగే చిత్రమిది. రాజకీయాల్ని ప్రేమించమని చెప్పే ప్రయత్నం. శరవేగంగా పూర్తి చేసి, ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇందులో నేనే కథానాయకుణ్ని. పోలీసు అధికారిగా కనిపిస్తాను'' అన్నారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే ఈ సినిమాకి రచయిత,దర్శకుడు,నటుడు పోసానే.

ఇక మెంటల్‌ కృష్ణ' విడుదలై యాభై రోజులైన సందర్భంగా పోసాని మాట్లాడుతూ "పరిమిత పెట్టుబడితో తెరకెక్కిన మెంటల్‌ కృష్ణ విజయవంతంగా ప్రదర్శితమైంది. 30 కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవాన్ని పూర్తి చేసుకొంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధం గురించి చర్చించిన ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభించింది. సినిమాకు ఆ పేరు బాగా కలిసొచ్చింది. నటుడిగా కూడా గుర్తింపు దక్కింది. ఆ పాత్రకు పోసాని చక్కగా సరిపోయాడని ప్రేక్షకులు అన్నారు. ఇంతకంటే ప్రశంస ఏం కావాలి. సంభాషణలు, కథాంశం అందరికీ నచ్చాయి కాబట్టే విజయం దక్కింది" అన్నారు.

అలాగే పోసాని ప్రజారాజ్యం పార్టీలో చేరారు కదా. రాజావారి చేపల చెరువు ఆ పార్టీ విధానాలకు సంబంధించిన చిత్రమా అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ "అటువంటిదేమీ కాదు. ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీని విమర్శిస్తూనో, సమర్థిస్తూనో ఉండదు" అన్నారు. అయితే ఈ చిత్రం ఈ మద్య ఏర్పడిన మహా కూటమిని ఉద్దేశిస్తూ సెటైర్స్ తో తీసిన చిత్రమని కొందరంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X