'అసలు శీలం అంటే ఏమిటి? పోసాని సూటి ప్రశ్న
శీలం ఆడవాళ్లకే ఉంటుందా? మగవాళ్లకి ఉండదా?..అసలు శీలం అంటే ఏమిటి? అనే విషయం చుట్టూ కథను అల్లుకున్నాం అంటూ తన తాజా చిత్రం జెంటిల్ మేన్ గురించి చెప్తున్నారు పోసాని కృష్ణమురళి, రచయిత నుంచి దర్శకుడుగా మారిన పోసాని వరసగా చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఆర్తి అగర్వాల్ ,లూసీ,తాను ప్రధాన పాత్రలో చేస్తూ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో తన చిత్రం గురించి మాట్లాడారు.
ఓ గృహిణి మానసిక స్థితికి, ఆమె ఆలోచనలకీ అద్దంపట్టేలా ఉంటుంది. ఉన్నత స్థాయికి ఎదిగిన ఓ వ్యక్తి... దర్జాగా కనిపిస్తూ బయటివాళ్లకి మంచివాడిగానే కనిపిస్తాడు. కానీ అతనిలోని అసలు మనిషి చేసే చేష్టలు ఏమిటన్నది తెర మీదే చూడాలి. అసలు స్వరూపం బయటకు వచ్చాక ఏం మనిషండీ బాబూ... అని తప్పకుండా అంటారు అంటూ తన చిత్రం కథ చెప్తున్నారు. ఈ చిత్రం సమర్పణ: నల్లం శ్రీనివాస్, నిర్మాత: నల్లం పద్మజ.ఇంతకుముందు ఆయన మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు, ఆపరేషన్ దుర్యోధన చిత్రాలు రూపొందించారు.


Click it and Unblock the Notifications











