twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోసాని కృష్ణమురళి 'నిత్య పెళ్లికొడుకు'

    By Srikanya
    |

    పెళ్లికి ముందు అమ్మాయి అందానికి ప్రాధాన్యతనిస్తారా, గుణానికి ప్రాధాన్యతనిస్తారా అనే పాయింట్ తో పోసాని హీరోగా 'నిత్య పెళ్లికొడుకు' పేరుతో ఓ సినిమా మొదలవుతోంది. అళహరి దర్శకత్వంలో సెవన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై జివి సుబ్బయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌరీ పండిట్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సోమా విజయప్రకాశ్ నిర్మాణ నిర్వాహకునిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో పోసాని మాట్లాడుతూ "కథ బాగుందనుకుని ఈ సినిమా చేస్తున్నా. నాకు తగ్గ బడ్జెట్‌తోటే ఈ సినిమా తయారవుతోంది'' అన్నారు.పోసాని...రాజా వారి చేపల చెరువు, జెంటిల్ మెన్ చిత్రాల తర్వాత చేస్తున్న చిత్రం ఇది.

    అలాగే దర్శకుడు అళహరి మీడియాతో మాట్లాడుతూ "మంచి సబ్జెక్టుతో ఈ సినిమా చేస్తున్నాం. ఇందులోని హీరో పాత్రకి పోసాని సరిగ్గా సరిపోతారు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాం" అని చెప్పారు. కల్పన, ఐడీపీఎల్ నిర్మల, అపూర్వ, ప్రసన్నకుమార్, జీవీ సుబ్బయ్య, జెన్నీ, శైలజ, లత తారాగణమైన ఈ చిత్రానికి మాటలు దీపికా రాజు, శైలకుమార్ అందించగా, కెమెరా... గాదిరాజు శ్రీను, ఎడిటింగ్ సాయి శ్రీనివాస్, థ్రిల్స్ సతీశ్, కళ కె. విజయ్‌కృష్ణ సమకూరుస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X