Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పోసాని కృష్ణమురళి 'నిత్య పెళ్లికొడుకు'
పెళ్లికి ముందు అమ్మాయి అందానికి ప్రాధాన్యతనిస్తారా, గుణానికి ప్రాధాన్యతనిస్తారా అనే పాయింట్ తో పోసాని హీరోగా 'నిత్య పెళ్లికొడుకు' పేరుతో ఓ సినిమా మొదలవుతోంది. అళహరి దర్శకత్వంలో సెవన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై జివి సుబ్బయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌరీ పండిట్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సోమా విజయప్రకాశ్ నిర్మాణ నిర్వాహకునిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో పోసాని మాట్లాడుతూ "కథ బాగుందనుకుని ఈ సినిమా చేస్తున్నా. నాకు తగ్గ బడ్జెట్తోటే ఈ సినిమా తయారవుతోంది'' అన్నారు.పోసాని...రాజా వారి చేపల చెరువు, జెంటిల్ మెన్ చిత్రాల తర్వాత చేస్తున్న చిత్రం ఇది.
అలాగే దర్శకుడు అళహరి మీడియాతో మాట్లాడుతూ "మంచి సబ్జెక్టుతో ఈ సినిమా చేస్తున్నాం. ఇందులోని హీరో పాత్రకి పోసాని సరిగ్గా సరిపోతారు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాం" అని చెప్పారు. కల్పన, ఐడీపీఎల్ నిర్మల, అపూర్వ, ప్రసన్నకుమార్, జీవీ సుబ్బయ్య, జెన్నీ, శైలజ, లత తారాగణమైన ఈ చిత్రానికి మాటలు దీపికా రాజు, శైలకుమార్ అందించగా, కెమెరా... గాదిరాజు శ్రీను, ఎడిటింగ్ సాయి శ్రీనివాస్, థ్రిల్స్ సతీశ్, కళ కె. విజయ్‌కృష్ణ సమకూరుస్తున్నారు.