Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తీసి డస్ట్ బిన్ లో పారేస్తారు: పోసాని మళ్ళీ పంచ్ వేసాడు
స్టొరీ రైటర్, నటుడు అయిన పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ అయిపోతున్నాడు. రచయితగా, దఋసకుడిగా కూడా చాలా సినిమాలే చేసిన పోసాని గతం లో అప్పుడప్పుడూ వెరైటీకోసం చిన్న పాత్రలు చేసేవాడు. కానీ పో
స్టొరీ రైటర్, నటుడు అయిన పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ అయిపోతున్నాడు. రచయితగా, దఋసకుడిగా కూడా చాలా సినిమాలే చేసిన పోసాని గతం లో అప్పుడప్పుడూ వెరైటీకోసం చిన్న పాత్రలు చేసేవాడు. కానీ పోనూ పోనూ పోసానికి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో వివాదాలను రేపే పోసాని మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
ప్రస్తుతం సినిమాల్లో ఎంతో మంది నటులున్నా తాను నటనలో ఇంకా రాణిస్తున్నాని అంతే కాకుండా నటుడిగా బిజీ అవ్వడం వల్లే మాటలు- దర్శకత్వం వంటి పనులను పక్కనపెట్టానని చెప్పారు. అంతే కాకుండా ఒకవేళ సినిమాలకు వీడు పనికిరాదు అనుకుంటే మాత్రం డస్ట్ బిన్ లో పడేయడం ఖాయమని చెప్పారు.
కానీ గత కొన్నేళ్లుగా తన నటనతో వారికి ఇంకా పనికొస్తూనే ఉన్నానని చెప్పారు. అలాగే తనను డస్ట్ బిన్ లో పడేయాలంటే నటనలోనే కాదు రచయితగాను తనకంటే బాగా టాలెంట్ మరియు దమ్మున్నోళ్లు రావాలని ఒకవేళ అటువంటి వారు వస్తే తనకి బయమేస్తుందని తెలిపారు. ప్రస్తుతం పోసాని ఎన్టీఆర్ - జై లవ కుశ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు.