నా గజ్జల్లో సమస్య, మహర్షి షూటింగ్ ఆగిపోవద్దు, బాబుకు కులపిచ్చి: పోసాని
రెండు రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి తనకు ఎన్నికల సంఘం నుంచి వచ్చిన నోటీసుల గురించి వివరించిన పోసాని కృష్ణ మురళీ బుధవారం మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. అందుకు కారణం అతడిపై ఓ టీవీ ఛానల్‌లో వచ్చిన వార్తా కథనాలే. పోసాని కృష్ణ మురళి నడవలేని పరిస్థితుల్లో యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడని ఆ కథనం సారాంశం.
తనపై సదరు ఛానల్‌లో వచ్చిన కథనంపై పోసాని స్పందించారు. నాకు ఒంట్లో బోగోలేదు అనే మాట వాస్తవం. ఆ విషయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారికి తెలుపుతూ లెటర్ కూడా రాశాను. అది సదరు టీవీ ఛానల్ వారు తెప్పించుకుని తనపై మరో రకంగా వార్తలు వేశారని మండి పడ్డారు.

ఆరోగ్య సమస్య వల్ల రాలేను అని లెటర్ రాశాను
నా ఆరోగ్యం బాగోలేదని లెటర్ రాయవడానికి కారణం ఉంది. ‘నేను చంద్రబాబును అన్ పాపులర్ చేయడానికి సినిమా తీస్తున్నట్లు టీడీపీ వారు కంప్లయింట్ చేశారు. అందుకే ఎన్నికల సంఘం వారు నోటీస్ ఇచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నేను ఎలాంటి సినిమా తీయడం లేదని వెంటనే రిప్లై ఇచ్చాను. వారు మరో నోటీసు పంపుతూ మీరు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. స్వయంగా రావడానికి నాకు ఆరోగ్య సమస్య ఉంది.' అని ఆ లెటర్ రాసినట్లు పోసాని వెల్లడించారు.

నా గజ్జల్లో సమస్య, మహర్షి షూటింగ్ ఆగపోవద్దు
నాకు నడుము కింది భాగంలో గజ్జల్లో ఒక ఇబ్బంది కిలిగింది. దాని వల్ల సరిగా నడవలేక పోతున్నాను. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేయాలనిచెప్పారు. మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి', ఇంకా కొన్ని సినిమా షూటింగులు ఉన్నాయి కాబట్టి అవి ఆగిపోకూడదని ఆపరేషన్ వాయిదా వేయించుకున్నట్లు పోసాని తెలిపారు.

నాపై పూర్తిగా అసత్య కథనాలు చూపించారు
నేను చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీస్తున్నాను అనే ఆరోపణతో నోటీసు వస్తే... కొన్ని సదరు ఛానల్ వారు మేకప్ వేసి ‘పోసాని కృష్ణమురళి చంద్రబాబుకు కులాన్ని ఆపాదించారు. ఆ విషయంలోనే టీడీపీ వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దానికి భయపడే అనారోగ్యం పేరుతో ఎన్నికల అధికారి ముందు హాజరు కావడం లేదంటూ ట్విస్ట్ చేసి చూపించారు' అని పోసాని మండి పడ్డారు.

చంద్రబాబుకు కులపిచ్చి ఉందని నేను చెప్పిన మాట వాస్తవం
చంద్రబాబుకు కులపిచ్చి ఉందని నేను చెప్పిన మాట వాస్తవం. దానికి నా వద్ద సాక్ష్యం ఉంది కాబట్టే ఆ విషయాన్ని స్ట్రాంగ్‌గా చెబుతున్నాను. నేనెప్పుడూ అబద్దం ఆడను, ఆడితే ప్రతి ఒక్క రిపోర్టర్‌కు, కెమెరామెన్‌కు క్షమాపణ చెప్పి కాళ్లకు దండం పెడతాను. అదీ నా క్యారెక్టర్... కానీ నువ్వు లంగా మనిషివి, లఫూట్ మనిషివి, చిల్లర మనిషివి అంటూ సదరు మీడియా ఛానల్ అధినేత మీద పోసాని ఫైర్ అయ్యారు.


Click it and Unblock the Notifications











