జగన్‌కు మళ్లీ ఓటెయ్యాలని అడగను: మీడియా ముందుకు వచ్చిన పోసాని

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపుకోసం ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తనవంతు కృషి చేశారు. ఆయన కృషి ఫలించి గురువారం విడుదలైన ఫలితాల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది. మే 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో శుక్రవారం పోసాని మీడియా ముందుకు వచ్చారు.

జగన్ సీఎంకావడంతో నా జీవితంలో అన్ని కోరికలు తీరిపోయాయి. కొత్త కోరికలు ఏమీ లేవన్నారు. కష్టాల్లో నుంచి వచ్చా.. డబ్బులు కవాలనుకున్నాను. అనుకున్నట్లే బాగా సంపాదించాను. నాకు అనుకూలమైన భార్య దొరకింది, ప్రేమగా చూసుకునే ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. జీవితంలో కోరికలు ఏమీ లేవు... బ్యాలెన్సుగా పెట్టుకున్న ఒక్క కోరిక దేవుడు ఇప్పుడు తీర్చాడని తెలిపారు.

తల్లి సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకున్నా

తల్లి సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకున్నా

ఇంతకాలం జగన్ సీఎం కావాలనే ఒకే ఒక కోరిక బ్యాలెన్సుగా పెట్టుకున్నాను. ఇదే నా జీవితంలో చివరి కోరిక స్వామి.. జగన్మోహన్ రెడ్డిగారిని ముఖ్యమంత్రిగా చేయాలని నా తల్లి సాక్షిగా మనస్పూర్తిగా మొక్కుకున్నాను. దేవుడు నా కోరిక తీర్చాడు. 151 సీట్లు ఇచ్చి జగన్‌గారిని ముఖ్యమంత్రిగా గెలిపించాడని పోసాని వ్యాఖ్యానించారు.

మీలో మనిషి మొలకెత్తాలంటే...

మీలో మనిషి మొలకెత్తాలంటే...

నిన్నటి వరకు జగన్‌ను వాడు, వీడు, ఫ్యాక్షనిస్ట్ అని సంబోధించిన చంద్రబాబు... ఇపుడు జగన్మోహన్ రెడ్డిగారికి శుభాకాంక్షలు అని చెప్పడం చాలా సంతోషం వేసిందన్నారు. ఇప్పటి వరకు జగన్ నాశనం కోరుకున్నవారు ఇక నుంచి మనస్పూర్తిగా ఆయన్ను ప్రేమించడం మొదలు పెట్టండి, మీలో మనిషి మొలకెత్తుతాడు అని పోసాని సూచించారు.

మళ్లీ జగన్‌కు ఓటెయ్యాలని అడగను

మళ్లీ జగన్‌కు ఓటెయ్యాలని అడగను

మళ్లీ జగన్‌కు ఓటెయ్యాలని అడగను... ఎందుకంటే ఒక్కసారి జగన్ గారికి ఓటేస్తే, ఆయన పాలన చూసి లైఫ్ లాంగ్ జగన్ గారికి మీరే ఓటేస్తారు. అంత గొప్ప లీడర్ ఆయన. అంతే గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజల దీవెనలు తీసుకుంటారనే నమక్మం ఉందని తెలిపారు.

పవన్ చాలా విషయాల్లో మంచి వ్యక్తి.. కానీ తప్పు చేశాడు

పవన్ చాలా విషయాల్లో మంచి వ్యక్తి.. కానీ తప్పు చేశాడు

పవన్ కళ్యాణ్ చాలా స్టామినా ఉన్న మనిషి. ఎనర్జిటిక్ ఫెల్లో... చాలా విషయాల్లో మంచి వ్యక్తి. రాజకీయ జీవితంలో ఎక్కడైతే తప్పు చేయకూడదో అక్కడే చేశాడు. రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత తన గురించి పక్కన పెట్టి సీనియర్ అనే వంకతో చంద్రబాబుకు సపోర్టు చేశాడో అక్కడే అతడి రాజకీయ జీవితం పతనం అయిపోయిందని పోసాని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్‌ను ప్రజలు అందుకే హర్షించలేదు

పవన్ కళ్యాణ్‌ను ప్రజలు అందుకే హర్షించలేదు

డ్యామేజీ ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడం వల్లే జనం హర్షించలేదు. అందుకే పవన్ క్రెడిబిలిటీ పోయింది. రాష్ట్రంలో అవినీతి, ద్రోహం జరుగుతుంది కాబట్టే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు...కానీ చంద్రబాబుకు సపోర్ట్ చేయడం వల్లే సగం రాజకీయ జీవితం పోయింది. ఇక నుంచైనా పవన్ కళ్యాణ్ వాస్తవం గ్రహించాలన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X