twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పంజాబీ హీరోయిన్‌కు ప్రముఖుడు కడుపు చేసి.. న్యాయం చేస్తావా పవన్? రేణుదేశాయ్ ఫోన్ చేసి.. పోసాని సంచలన వ్యాఖ్యలు

    |

    సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వ పనితీరు, మంత్రులు అవినీతి గురించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు రాజకీయ, సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు, సినీ ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ చేసిన ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోసాని కృష్ణ మురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్‌పై పోసాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ...

     సాయిధరమ్ తేజ్ మంచివాడు..

    సాయిధరమ్ తేజ్ మంచివాడు..

    సాయిధరమ్ తేజ్ ఏదో యాక్సిండెంట్‌కు గురయ్యాడు. దాంతో పవన్ కల్యాణ్ బయటకు వచ్చి ఆవేదనకు గురయ్యాడు. అయితే సాయిధరమ్ తేజ్ ఎవరి అండతోను పైకి రాలేదు. ఆయన తల్లి పెంపకం వల్ల పైకి వచ్చాడు. నేను ఆయనకు తండ్రితో సమానమని సాయిధరమ్ తేజ్ చెప్పాడు. చిత్రలహరి సినిమాలో ఆయనకు తండ్రి వేషం వేశాను. సాయిధరమ్ తేజ్ మంచి వాడు. కానీ యాక్సిడెంట్ గురైతే త్వరగా కోలుకోవాలని కోరుకొన్నాను. కానీ రిపబ్లిక్ ఫంక్షన్‌లో ఆ విషయాన్ని ఆసరాగా చేసుకొని ఏపీ ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను ఒరే సన్నాసి.. వెధవ అంటూ తిట్టడం నాకు నచ్చలేదు. మీరే లక్షలు సంపాదించుకొంటారా? మేము సంపాదించుకోవద్దా అంటూ అవాకులు చెవాకులు పేలడం సరికాదు అని పోసాని అన్నారు.

     పంజాబీ అమ్మాయికి కడుపు చేసి..

    పంజాబీ అమ్మాయికి కడుపు చేసి..

    తెలుగు సినీ పరిశ్రమలోకి పంజాబీ అమ్మాయి వచ్చింది. తెలుగు వాళ్లు చాలా మంచి వాళ్లు అని చెప్పి ఎన్నో కలలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ ఆ అమ్మాయికి వేషాలు ఇప్పిస్తానని ఓ ప్రముఖుడు మోసం చేశాడు. ఆయన మోసం వల్ల ఆ అమ్మాయికి కడుపు అయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి న్యాయం చేయమని అడిగితే బెదిరించారు. మీడియాకు చెబితే ప్రాణాలు దక్కవని బెదిరించారు. ఐదు కోట్లు ఇచ్చి ఆమెకు గర్బస్రావం చేశారట అని పోసాని కృష్ణ మురళి అన్నారు.

    పంజాబీ హీరోయిన్‌కు న్యాయం చేస్తాడా?

    పంజాబీ హీరోయిన్‌కు న్యాయం చేస్తాడా?

    పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో అమ్మాయిలపై ఎవరైనా కన్నువేస్తే.. కన్ను పీకేస్తానని అన్నాడు. అమ్మాయిలకు అన్యాయం చేస్తే సహించని అన్ని అన్నాడు. అలాంటి వ్యక్తికి నేను ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి చెబుతాను. ప్రశ్నించే గుణం ఉన్న పవన్ కల్యాణ్ అ అమ్మాయికి న్యాయం చేయాలి. ఆ అమ్మాయితో వచ్చి మీడియా ద్వారా న్యాయం చేయాలి. ఆ కేసును సీబీఐకి అప్పగించేలా ప్రయత్నించాలి అని పోసాని కృష్ణ మురళీ డిమాండ్ చేశాడు. అలా చేస్తే నేను రాములవారి గుడి మాదిరిగా పవన్ కల్యాణ్‌కు గుడి కడుతాను. గాంధీ కంటే గొప్పవాడని అంటాను. దయచేసి పవన్ కల్యాణ్ ఈ ఒక్క పని చేయండి. మీరు చేయగలరా? ఒకవేళ చేస్తే జగన్ కంటే.. ఎవరెస్ట్ కంటే గొప్పవాళ్లని నేను కీర్తిస్తాను అంటూ పోసాని కృష్ణ మురళీ పేర్కొన్నారు.

     పవన్ కల్యాణ్‌కు గుడి కడుతాను అంటూ పోసాని

    పవన్ కల్యాణ్‌కు గుడి కడుతాను అంటూ పోసాని

    ప్రపంచంలోనే ప్రాణాలతో బతికి ఉన్న పవన్ కల్యాణ్ గుడి కట్టి పూజలు చేసేలా నేను ప్రయత్నిస్తాను. అలా మా ప్రముఖుడికి అలా గౌరవం దక్కితే మాకు గర్వకారణంగా ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయికి న్యాయం చేయకపోతే.. జగన్‌ను, మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రశ్నించే హక్కు లేదని నేను అంటాను. మీకు ఓ ఆడ పిల్లలకు న్యాయం చేసే గుణం ఉంది కదా.. ఆ పని చేయి అంటూనే.. మీకు ఆ విషయం చాతకాదు.. వెళ్లవయ్యా అంటూ కామెంట్ చేశాడు. అంతేకాకుండా నీ గురించి జనానికి తెలుసు కాబట్టి.. నిన్ను ఎక్కడ పెట్టాలో జనం తెలిసి ఓడించారనే విధంగా పోసాని మాట్లాడారు.

     పవన్ కల్యాణ్‌ను అలా కాపాడుకొన్నాను అంటూ..

    పవన్ కల్యాణ్‌ను అలా కాపాడుకొన్నాను అంటూ..

    ప్రజారాజ్యం పార్టీలోకి నన్ను చిరంజీవి ఆహ్వానించినప్పుడు మీడియాలో లైవ్‌ పెట్టారు. 30 నిమిషాల కార్యక్రమం కాస్త గంటన్నరగా మారింది. అప్పుడు కొందరు నాపై ఎగబడి పవన్ కల్యాణ్ గురించి, చిరంజీవి గురించి అనేక ప్రశ్నలతో రచ్చ చేశారు. అయితే నేను సరైన సమాధానాలు ఇచ్చి నేను కాపాడుకొన్నాను. పవన్ కల్యాణ్‌ను కాపాడుకొన్నాను. ఆయన వైవాహిక జీవితం గురించి మాట్లాడుకొన్నా. అప్పుడు అది నా బాధ్యత. అలా మాట్లాడిన తర్వాత సాయిధరమ్ తేజ్ తల్లి ఫోన్ చేసి ఎన్నికల సమయంలో మా ఫ్యామిలీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. మీరు బాగా గొప్పగా మాట్లాడారు అని అన్నారు.

     రేణుదేశాయ్ కాల్ చేసి అంటూ..

    రేణుదేశాయ్ కాల్ చేసి అంటూ..

    ప్రెస్ మీట్ తర్వాత నాకు రేణు దేశాయ్ కాల్ చేసి.. మీరు మాట్లాడుతుంటే.. టీవీ ముందు పవన్ టెన్షన్ పడుతున్నారు. మీరు బాగా మాట్లాడారని అన్నారు. అది నా బాధ్యత. మీరు తప్పుగా మాట్లాడితే తప్పుగా రాస్తారు. మంచిగా మాట్లాడితే మంచిగా రాస్తారు అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి పోసాని కృష్ణమురళీ అన్నారు.

    Recommended Video

    Heroine Shwetta Parashar About 'Alanti Sitralu' Movie
    రాజకీయంగా పవన్ తప్పులు

    రాజకీయంగా పవన్ తప్పులు

    పవన్ కల్యాణ్ రాజకీయంగా తప్పులు చేస్తున్నారు. రాజకీయంగా స్థిరత్వం లేదు. చిరంజీవి ఎవరు చెప్పినా వింటారు. అతడి గురించి ఏనాడు నేను ఒక మాట మాట్లాడలేదు. తన రెమ్యునరేషన్ ఎంతో చెప్పలేదు. పది కోట్లు అనుకో అంటే ఎవరైనా నమ్ముతారా? ఆయన పది కోట్లు తీసుకొంటే నేను ఆయనతో నాలుగు సినిమాలు చేస్తా? నా కోసం చేస్తారా అంటూ పోసాని ప్రశ్నించాడు. ఆయన 50 కోట్ల పారితోషికం తీసుకొంటాడు. ప్రభుత్వాలు వాటి గురించి అడగదా? అని పోసాని అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్న కారణంగానే నేను జగన్‌కు సపోర్ట్ చేస్తున్నాను అని అన్నారు.

    English summary
    Posani Krishna Murali questions Pawan Kalyan over Injustice to Tollywood heroine. Posani asked to do justice to Punjabi Girl who cheated by a film Personality.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X